Home సినిమా సమంతపై సుకుమార్ కీలక వ్యాఖ్యలు.. నా చెంప చెళ్లుమనిపించినట్లు అయ్యింది – Andhra Waves

సమంతపై సుకుమార్ కీలక వ్యాఖ్యలు.. నా చెంప చెళ్లుమనిపించినట్లు అయ్యింది – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


నటిగా సమంత క్రేజ్
ఆమె కెరీర్ లో రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
రామ లచ్చిమిగా ఒక రేంజ్ పెర్ ఫార్మెన్స్
వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్



రంగస్థలం(రంగస్థలం).. హీరోలు,దర్శకులకే కాదు మూవీకి కూడా అభిమానులు, డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారని నిరూపించిన చిత్రాల్లో ఒకటి. రామ్ చరణ్(రామ్ చరణ్) సుకుమార్(సుకుమార్)అయితే ఈ పేరు తలుచుకోకుండా తమ దినచర్య ప్రారంభించకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా రంగస్థలం ఆ ఇద్దరి సినీ లైఫ్ లో మంచి బూస్టప్ ఇచ్చింది. అసలు ఆ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సినీ పర్సనాలిటీస్ గా ఇద్దరు ఉండటానికి కూడా రంగస్థలం కారణం. మరి సమంతకి కూడా స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. ఆమెకి స్పెషల్ మూవీ ఏంటి! అసలు సమంత తప్ప మరొకరు రామలచ్చిమిగా చేస్తే రంగస్థలం రిజల్ట్ లో కొంచం తేడా ఏమైనా వచ్చేదేమో. అంతలా బుచ్చిబాబు(రామ్ చరణ్) ని ఆటపట్టించి ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు రేపింది. ఇక రంగస్థలం మార్చి 30తో ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది.ఈ సందర్భంగా కొన్ని స్వీట్ మెమొరీస్ అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో సోషల్ మీడియా సాక్షిగా మరో సారి గిలిగింతలు రేపుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

రంగస్థలం తన ప్రభావం చూపిస్తున్న రోజులు. ఆ టైంలో సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే సమంత(సమంత)ని హీరోయిన్ గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కొత్త అమ్మాయి, లేదా నార్మల్ హీరోయిన్ ని అనుకున్నా. రామ్ చరణ్, సమంత ఇద్దరూ స్టార్లే కాబట్టి ,ఆ ఇద్దర్ని సెట్ లో మేనేజ్ చేయలేనేమో అనేది నా భావన. కానీ సమంత ఒక్కో సీన్ లో చేసే విధానం చూసినప్పుడల్లా నా చెంప చెళ్లుమనిపించినట్లు అయింది. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇకపై సమంతతో సినిమాలు చేస్తూనే ఉండాలని డిసైడ్ అయ్యాను.

కూడా చదవండి: రంజిత్: ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు అరెస్ట్

ఇక అప్పటికి సమంతకి వివాహం జరిగింది. అయినా కూడా రంగస్థలం మూవీలో లిప్ లాక్ సీన్ లో చేసింది. ఆ సీన్ చేస్తున్నప్పుడు, తనకి పెళ్లయిందా కాలేదా అని ఆలోచించలేదు. ఆమె క్యారక్టర్ కి ప్రేమని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియని పరిస్థితి . దీంతో ముద్దు పెట్టుకుని ప్రేమని చేయాలి. కళాత్మకంగా మాత్రమే సదరు ముద్దు సన్నివేశాన్ని చూడాలని సుకుమార్ అన్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో 80వ దశకంలో అంత రొమాన్స్ ఉండేదా అని యాంకర్ ప్రశ్నించారు. అప్పుడు సుకుమార్ మాట్లాడుతుంది . మీది పల్లెటూరు అయితే మీకు అర్థం అవుతుంది. అప్పట్లో సరసం అనేది లైఫ్ లో ఒక భాగంగా ఉండేది. దానిని వల్గర్ గా చూసేవాళ్ళు కాదు. లిప్ లాక్ సీన్ ని ఒక ఆర్ట్ ఫామ్ లా మాత్రమే చూడాలని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిన పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేసి పుష్ప ఇంకొన్ని రోజులు స్క్రీన్ పై నడిచేలా చేయడంలో తన వంతు సినీ ధర్మాన్ని నిర్వర్తించిన విషయం తెలిసిందే.


You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird