Home Latest News ఇరాన్ కు రష్యా వెన్నుదన్ను! | ఇరాన్‌కు రష్యా మద్దతు | యుద్ధం | అమెరికా | మిలిటరీ ఎయిడ్ | పశ్చిమాసియా యుద్ధం | రష్యాఇరాన్ – Andhra Waves

ఇరాన్ కు రష్యా వెన్నుదన్ను! | ఇరాన్‌కు రష్యా మద్దతు | యుద్ధం | అమెరికా | మిలిటరీ ఎయిడ్ | పశ్చిమాసియా యుద్ధం | రష్యాఇరాన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తదాడులను ఇరాన్ దీటుగా ఎదుర్కొనడం వెనుక రష్యా వెన్నుదన్నులు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. రష్యా, ఇరాన్ సంబంధాలు, రష్యా ఇరాన్‌లకు రక్షణ సహాయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

యుద్ధ సమయంలో ఇరాన్‌కు రష్యా సహకారం ఏ మేరకు అన్న విషయంపై ఆసక్తికర అంశాలు ఈ చర్చల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్ల కదలికలకు సంబంధించిన అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ మాస్కో ఇరాన్ కు చేరవేస్తున్నదన్న చర్చ జోరుగా సాగుతోంది. రష్యా నిఘా సహాయం కారణంగానే ఇరాన్ అమెరికాను దీటుగా ఎదుర్కొనడమే కాకుండా, తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఎదురుదాడికి గురవుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రష్యా అత్యాధునిక ‘లియానా’ గూఢచారి ఉపగ్రహాల ద్వారా అమెరికా విమానవాహక నౌకలపై నిరంతరం ఉంచుతూ, ఈ డేటాను ఇరాన్‌కు అందిస్తోంది, ఆ కారణంగానే.. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్‌కు తేలిక అవుతోంది. ముఖ్యంగా ఖయ్యం వంటి శక్తివంతమైన శాటిలైట్ల రూపకల్పనలోనూ రష్యా సహకారం ఇరాన్‌కు కొండంత బలంగా మారిందంటున్నారు. ఖయ్యం ఉపగ్రహం అందించే స్పష్టమైన చిత్రాల ఆధారంగా ఇరాన్ ప్రభావమంతంగా, శక్తిమంతంగా, సమర్ధవంతంగా అమెరికాపై క్షిపణిదాడులు నిర్వహించగలుగుతున్నట్లు చెబుతున్నారు.

ఒక పోతే ఆయుధాల మార్పిడి విషయంలోనూ ఇరాన్, రష్యాల మధ్య ఉన్న బలమైన ఒప్పందం ఉందని, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ తన షాహిద్ డ్రోన్లను రష్యాకు భారీగా సరఫరా చేసిందని చెబుతున్నారు. కాగా యుద్ధ అనుభవాలతో రష్యా షాహిద్ డ్రోన్‌లను మరింత ఆధునీకరించిందనీ, ఏఐఐ, యాంత్రిక జామింగ్ టెక్నాలజీతో వీటిని మరింత మెరుగుపరిచి వాటిని తిరిగి ఇరాన్‌కు పంపిస్తోందనీ, ఈ ఆధునిక సాంకేతికతతో డ్రోన్‌లు శత్రువుల గగనతల రక్షణను సులువుగా ఛేదిస్తున్నాయనీ, ఆ కారణంగా అమెరికా అంచనాలు తప్పడం లేదు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird