ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నెల్లూరు, కడప జిల్లాల్లో బుధవారం (ఏప్రిల్ 1)పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ, ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవంలో సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదట బుధవారం (ఏప్రిల్ 1) ఉదయం నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందిస్తారు. అనంతరం ఆయన నేరుగా కడప జిల్లా ఒంటిమిట్టకు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు.
బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర కళాశాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి, లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు.
అనంతరం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ ముగించుకుని సాయంత్రం నాలుగు గంటల 25 నిమిషాలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. ఆరున్నర గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. ఒక బుధవారం రాత్రి ఒంటిమిట్టలోనే బస చేస్తారు.
