- అభిమానం ముసుగులో అరాచకం
- షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో నటిపై వేధింపులు
- సెల్ఫీల సాకుతో హనీ రోజ్‌తో అసభ్య ప్రవర్తన
మలయాళ ముద్దుగుమ్మ ‘హనీ రోజ్'(హనీ రోజ్) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌లు మాత్రమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, బ్రాండ్ ప్రమోషన్‌లతో నిత్యం ఉండే ఈ నటిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తాకరాని చోట తాకి
కేరళలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హనీ రోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన అభిమాన నటిని చూడటానికి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎప్పటిలాగే నవ్వుతూ పలకరిస్తూ, అందరికీ సెల్ఫీలు ఇస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అతిగా ప్రవర్తించారు. సెల్ఫీ తీసుకుంటున్న నెపంతో ఆమె నడుముపై వెనుక భాగంలో(నడు కింద) చేతులు వేస్తూ అసభ్యంగా తాకారు. జనం మధ్యలో ఉండటం వల్ల మొదట సంయమనం పాటించారు, వారి ప్రవర్తన మితిమీరడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానం ఉండాలి కానీ, అది వేధింపుల స్థాయికి చేరకూడదని నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రిటీల భద్రత విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి పనులకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ పలువురు హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. పబ్లిక్ లో ఇలా జరగడం దురదృష్టకరం.
టాలీవుడ్‌లో హనీ రోజ్ క్రేజ్
‘వీరసింహారెడ్డి’ సినిమాతో హనీ రోజ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు, ముఖ్యంగా ‘మా బావ మనోభావాలు’ పాటలో ఆమె వేసిన స్టెప్పులకు కుర్రకారుకు ఫిదా అయ్యారు. అంతకుముందే తెలుగులో ‘ఆలయం’, ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ, బాలయ్య సినిమాతోనే ఆమెకు అసలైన బ్రేక్ దక్కింది.
కేవలం సినిమాల ద్వారానే కాకుండా, కొన్ని వివాదాల ద్వారా కూడా హనీ రోజు వార్తల్లో నిలిచింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యాపారవేత్తపై ఆమె చట్టపరమైన పోరాటానికి దిగింది. అలాగే తనను వేధింపులకు గురిచేస్తున్న సుమారు 27 మంది పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచారు. “నేను మీమ్స్, జోక్స్‌ను ఎంజాయ్ చేస్తాను కానీ, అసభ్యతను సహించను” అని ఆమె గట్టిగా చెప్పడం విశేషం.
త్వరలో హనీ రోజ్ తన తదుపరి సినిమా ‘రాచెల్’ (రాచెల్) తో అలరించడానికి సిద్ధమవుతోంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
