
మహదేవపురం, ముద్ర:
సీనియర్ కాంగ్రెస్ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, సింగిల్ విండో మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిరకాలంలో రాజకీయాలలో ఉంటూ పార్టీ పరభేదం లేకుండా పేరు తెచ్చుకున్నారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. స్వర్గీయ శ్రీపాదరావు, మంత్రి శ్రీధర్ బాబు వద్ద ప్రజా సమస్యలు నిత్యం ప్రస్తావించే వారిలో మేము ముందుండే వారిగా అన్నారు. సర్పంచ్ హసీనాబాను మాట్లాడుతూ వయసును ఏమాత్రం లెక్క చేయకుండా ఎన్నికలలో ఉదయం 5 గంటల నుండి కార్యకర్తలు పార్టీ ప్రతిష్టకు పాటుపడాలని తాను కూడా సర్పంచ్ పదవిలో ఉన్నారని అన్నారు. మాజీ ఎంపీపీ రాణిబాయి మాట్లాడుతూ వామన్ రావు గారు పేదల కష్టాలలో పిలుపు లేకున్నా వారి వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేవాడని, ఎవరినైనా తన కుటుంబసభ్యునిగా స్వీకరించి ఆత్మీయతతో వెళ్లేవాడని వారు నిన్ను నూరేళ్లు వర్ధిల్లాలని వివరించారు. సన్మాన గ్రహీత పెనుమంట్ర రామారావు మాట్లాడుతూ వక్తలు ప్రశంసించినట్లుగా తాను మహానీయుడిని కాదని ప్రజలలో ఒక్కడిని మాత్రమేనని, శ్రీపాదన ఆశీస్సులు తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రజల కష్టాలలో పాలుపంచుకోవడానికి ఎల్లవేళల ముందు ఉంటానని అన్నారు. ఈ నిర్వాహకులు సత్య నారాయణ, బేంబిరి దేవరావు, ఆనకారి ప్రభాకర్ నిర్వహించారు. మాజీ దేవస్థానం చైర్మన్ గూడాల శ్రీనివాస్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆకూరు విక్రమ్ సింగ్, తస్సలు చేనేత సంఘం అధ్యక్షులు గొర్రె బాపు, రిటైర్డ్ ఎంఈఓ అడపా రాజయ్య, ఉప సర్పంచ్ శ్రీజ, ఏఐసీఐ ఇర్షాద్, ఎలికేశ్వర మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, విద్యావేత్తలు ఎంఎం శశి, చీర్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ యువజన నాయకులు పాల్గొన్నారు.