-కాంతార, కాంతార చాప్టర్ 1 తో క్రేజీ హీరోగా రిషబ్ శెట్టి
-సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టీవ్
-కానీ ఆ హీరోయిన్ ని ఎందుకు అన్ ఫాలో చేసాడు
రిషబ్ శెట్టి(రిషబ్ శెట్టి)..స్తబ్దుగా ఉన్న సౌత్ చిత్ర పరిశ్రమకి కాంతార, కాంతార చాప్టర్ 1(కాంతారావు చాప్టర్ 1)తో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఎంతలా అంటే ఎన్టీఆర్ ఇండియన్ సినీ పరిశ్రమకి చెందిన మేకర్స్ మొత్తం కాంతార టైప్ లో మూవీని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యేంతలా. దీంతో రిషబ్ శెట్టి గురించిన నిత్య తాజా అప్‌డేట్ గురించి తెలుసుకునే అభిమానుల నెంబర్ ఏ రోజుకా రోజు పెరుగుతూనే ఉంది. ఈ విధంగానే ఒక న్యూస్ వాళ్ళందరిని షాక్ కి గురవ్వలా! ఆలోచనలలో పడాలా! అనే అయోమయంలో పడేలా చేసింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. రీసెంట్ గా తన ఇనిస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్(రుక్మిణి వసంత్)ని అన్ ఫాలో చేసాడు.కాంతార చాప్టర్ 1 లో ప్రిన్సెస్ కనకవతి గా రుక్మిణి వసంత్ అత్యద్భుతమైన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసింది. చిత్ర విజయంలో కూడా ఆమె భాగముందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాంటిది రిషబ్ శెట్టి అన్ ఫాలో చేసిన న్యూస్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత, నటుడు రాజ్ బి శెట్టి ని కూడా రిషబ్ అన్ ఫాలో చేసాడు. పైగా రిషబ్, రాజ్ సుదీర్ఘ కాలం నుచి మంచి మిత్రులు. రెండు రోజుల క్రితం కాంతార ని నిర్మించిన హోంబులే ఫిలిమ్స్ ని కూడా రిషబ్ అన్ ఫాలో చెయ్యడం జరిగింది.
కూడా చదవండి: వరుణ్ తేజ్: అన్నయ్యకే ఎదురొస్తున్న తమ్ముడు.. 2027 సంక్రాంతి ఎవరిది
రిషబ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే జై హనుమాన్ తో పాటు ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్” అనే చిత్రాల్లో చేస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాలపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.

