Home Latest News బోయినపల్లి మార్కెట్లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా | బోయినపల్లి మార్కెట్ వద్ద ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా | పారిశుధ్యం | సమస్య – Andhra Waves

బోయినపల్లి మార్కెట్లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా | బోయినపల్లి మార్కెట్ వద్ద ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా | పారిశుధ్యం | సమస్య – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


బోయినపల్లి మార్కెట్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త, పారిశుధ్య సమస్యలపై ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. దీంతో శనివారం బోయనపల్లి మార్కెట్ లో ఒకింత ఉద్రిక్తత. మార్కెట్‌లో పారిశుద్ధ్య సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ధర్నా వీడేది లేదని ఈటల అల్టిమేటం ఇచ్చి ధర్నాకు కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ నగరానికి ప్రధాన కూరగాయల సరఫరా కేంద్రం అయిన బోయినపల్లి కూరగాయల మార్కెట్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం వేలాది మంది రైతులు, కార్మికులు, వ్యాపారులు రాకపోకలు సాగించే ఈ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా చెత్త మార్కెట్ ప్రాంగణమంతా చెత్త కుప్పలతో నిండిపోయింది. నుంచి వస్తున్న తీవ్రమైన దుర్గంధంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనికి తోడు నిన్న రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు చెత్తతో కలిసిపోవడంతో బురదనీళ్లు కూరగాయలు అమ్మే ప్రాంతాల వరకు చేరాయి. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన మార్కెట్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. సమస్యను ఈటల దృష్టికి తీసుకువెళ్లారు.

దాదాపు పాతికేళ్లుగా బోయన్ పల్లి మార్కెట్ హైదరాబాద్ మహానగరానికి కూరగాయల సరఫరాదారుగా ఉంటోంది. ఈ మార్కెట్ ను రోజూ పది వేల మందికి పైగా వినియోగదారులు కూరగాయల కోనుగోలు కోసం వస్తారు. వీరు కాకుండా వేల సంఖ్యలో వాహనాలు, వ్యాపారులు, కార్యకర్తలు ఉంటారు. ఏటా 15 కోట్లకు పైగా ఆదాయం ఈ మార్కెట్ ద్వారా వస్తోంది. అయితే బోయనపల్లి కూరగాయల మార్కెట్‌లో గత తొమ్మిది నెలలుగా తీవ్ర పారిశుధ్య సమస్య విలయతాండవం చేస్తోంది. చెత్త తొలగింపు కాంట్రాక్టర్లు, టాయిలెట్లు శుభ్రం చేసే కార్మికులకు చెల్లింపులు జరగక వందల లారీల చెత్త అక్కడ పేరుకుపోయింది.
మార్కెట్ లో పారిశుద్ధ్య లోపం వ్యాధులకు కారణమౌతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో పారిశుద్ధ్య సమస్య కారణంగా కస్టమర్లు ఈ మార్కెట్ కు రావడం తగ్గించారు. దవీంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో నిర్మించిన వాటర్ ట్యాంక్‌లో నీరు లేకపోవడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. తాను తెలిసి తాత్కాలికంగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం తప్ప ప్రభుత్వం నుంచి శాశ్వత చర్యలు లేవని ఎంపీ ఈటల రాజేందర్ వస్తున్నాడు. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకూ తన ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే మార్కెట్ ను రెండు మూడు రోజుల పాటు బంద్ చేసి పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఈటల డిమాండ్ చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird