Home ఆరోగ్యం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ – Andhra Waves

శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ – Andhra Waves

by
0 comments
శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ


 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సంబు పాండు, క్యాషియర్ వాస శ్రీనివాసులు, కార్యదర్శి కందికొండ సాయికృష్ణ, అల్లంపల్లి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కొత్త నరేష్ బాబు, శ్రీకాంత్ తదితర కిరాణా సభ్యులు ఉన్నారు.

ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird