
బీర్ల ధరల పెంపునకు ఛాన్స్
తయారీ ఖర్చులు పెరిగాయి
కంపెనీల ప్రతిపాదనలు
ఒక్కో కేసుపై రూ. 35 వరకు పెరిగే అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మందు బాబులకు షాక్. బీర్ల ధరలకు భారీగా పెరుగుతున్నాయి. ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. దీంతో తక్షణమే ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దం అయ్యాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే బీర్ల ఉత్పత్తికి ఖర్చు 15 శాతం పెరిగింది. కాగా, ఇదే సమయంలో విదేశీ బ్రాండ్ల ఉత్పత్తుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అమ్మకాలు భారీగా మారుతున్నాయి. దీంతో.. బీర్ల ధరల పెంపుకు రంగం సిద్దం చేసారు. కొత్త ధరలు ఫిక్స్ అయ్యాయి. బీర్ల ధరల పెంపుకు రంగం సిద్దమైంది. బీర్ల ఉత్పత్తి ధరలు పెరిగాయి. ఫలితంగా ఆ భారం కొనుగోలుదారుల పైన మోపేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ధరలను పెంచక తప్పద ని బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఉత్పత్తి ట్యాక్సులు, ఇతర ఖర్చులు పెరగడంతో బీర్ల తయారీ కంపెనీలు సతమతమవుతున్నాయి. పన్నుల కారణంగా ఉత్పత్తి ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగాయని, కంపెనీలపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బీరు సీసాల ధరలు 20 శాతం పెరిగాయి. ఇక ఇతర మెటిరియల్ ఖర్చులు కూడా 20 నుంచి 25 శాతం పెరిగాయి. రవాణా ఖర్చులు కూడా 10 శాతం మేర పెరిగాయి.. బీర్ల ధరల పెంపు అనివార్యంగా మారిందని చెబుతున్నారు. ప్రధానంగా ఏబీ ఇన్‌బెవ్, కార్ల్‌బర్గ్ కంపెనీలు 85 శాతం బీర్ అమ్మకాలను చేపడుతున్నాయి.
ప్రతిపాదనలు సిద్దం చేసిన కంపెనీలు
ఇలా అన్ని రకాలుగా ఖర్చులు పెరుగుతాయని బీర్ల ధరలను పెంచాలని కంపెనీలు తాజాగా ప్రతిపాదనలు సమర్పించాయి. ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. ఈ ప్రతీ బీర్ కేసుపై రూ.20 మేర ధరను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలకు ఈ అంశం పైన ప్రతిపాదనలు సమర్పించారు. రేట్లు పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని.. అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇరాన్ – ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది. మళ్ళి మందుల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్‌కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరలు పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి. లాస్ బాటిల్ ధరలు 20 శాతం పెరిగాయి. అలాగే, బీర్లను ఉంచే పేపర్ కార్టన్ రేట్లు కూడా రెట్టింపైనట్లు తయారీ కంపెనీలు చెబుతున్నాయి. లేబుల్స్, టేప్స్ వంటి ధరలు కూడా పెరిగాయి. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా లేకపోవడంతో వీటన్నింటి తయారీ సంస్థలు తమ తయారీని తగ్గించాయి. వేసవి కాలం కావడం, డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమపై భారం తగ్గాలంటే 12 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని కోరుతున్నారు. దీనితో, ఒకటి రెండు రోజుల్లో బీర్ల ధరల పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.