Home Latest News అయోధ్య రామమందిరంలో…బాల రాముడి నుదుట మెరిసిన సూర్యతిలకం | అయోధ్య రామ మందిరం సూర్య తిలక్ 2026 | రామ నవమి వేడుకలు అయోధ్య | రామ్ లల్లా సూర్య తిలక్ టైమింగ్ | అయోధ్య టెంపుల్ న్యూస్ తెలుగు – Andhra Waves

అయోధ్య రామమందిరంలో…బాల రాముడి నుదుట మెరిసిన సూర్యతిలకం | అయోధ్య రామ మందిరం సూర్య తిలక్ 2026 | రామ నవమి వేడుకలు అయోధ్య | రామ్ లల్లా సూర్య తిలక్ టైమింగ్ | అయోధ్య టెంపుల్ న్యూస్ తెలుగు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అయోధ్య ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. కోట్లాది మంది భక్తులకు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు తిలకించారు. సుమారు 4 నిమిషాల పాటు సాగిన ఈ ‘సూర్య తిలకం’ అద్భుతాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య నగరం మారుమోగిపోయింది.

ఈ విశేష కార్యక్రమం కోసం భారతీయ శాస్త్రవేత్తలు అత్యాధునిక ‘ఆప్టో-మెకానికల్’ వ్యవస్థను రూపొందించారు. గర్భాలయంలో ఉన్న రామ్ లల్లా విగ్రహంపైకి సూర్యరశ్మి నేరుగా ప్రసరించేలా అద్దాలు, లెన్స్‌లతో కూడిన పైపుల ద్వారా ఈ కిరణాలను మళ్లించారు. దాదాపు 58 మిల్లీమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ వెలుగు కిరణం స్వామివారి నుదుటిపై తిలకంలా మెరిసి, సూర్యవంశ సంభూతుడైన రాఘవేంద్రుడికి భానుడే స్వయంగా నీరాజనం అర్పించినట్లుగా అనిపించింది.

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు పోటెత్తారు. దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ విఐపి దర్శనాలను రద్దు చేసింది. నగరం అంతటా వందలాది ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, గర్భాలయంలో జరుగుతున్న అభిషేకం, సూర్య తిలకం వంటి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసారు.

ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం డిజిటల్ మాధ్యమాల వీక్షించారు. రామ్ లల్లాకు జరిగిన ఈ సూర్యాభిషేకం భారతీయ సంస్కృతి, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి నిలువెత్తు సాక్ష్యమని ప్రముఖులు అభివర్ణించారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ, ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ వేడుకను నిర్వహించేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసర్చ్ ఇన్ డిగ్రీ మరియు ఇండియన్ ఇన్‌స్పోర్ట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు నెలల తరబడి శ్రమించారు.

రామనవమి తిథి ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, సరిగ్గా అదే రోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు స్వామివారి నుదుటిపై పడేలా 19 ఏళ్ల చక్రానికి సరిపడా మేకనిజంను వారు సిద్ధం చేయడం విశేషం. భవిష్యత్తులో కూడా ప్రతి ఏటా రామనవమి పర్వదినాన ఈ సూర్య తిలక వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయ నిర్మాణం పూర్తిగా పూర్తయిన తర్వాత, భక్తులకు మరింతగా ఈ దృశ్యాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird