Home సినిమా హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ: హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ – Andhra Waves

హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ: హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


-సినిమా పేరు: హ్యాపీ రాజ్
-న’టీన’ట్లు: జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీప్రియ, అబ్బాస్, జార్జ్ మర్యన్, గీతా కైలాసం తదిత’రులు
-సినిమాటోగ్రఫీ: మదన్ క్రిస్టోపర్
-ఎడిటింగ్: సెల్వ ఆర్ కే
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
-నిర్మాత: జయవర్ద్
-బ్యానర్: బియాండ్ పిక్చర్స్
-రచన,దర్శకత్వం: మరియ రాజా
-రిలీజ్ తేదీ : మార్చి 27, 2026

మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే జివి ప్రకాష్ కుమార్(Gv Prakash kumar)మరోసారి హీరోగా సెల్యులాయిడ్ పై ఈ రోజు ‘హ్యాపీరాజ్'(హ్యాపీ రాజ్)తో అడుగుపెట్టాడు. రొమాంటిక్ డ్రామా కావడం, ప్రచార చిత్రాలతో హైప్ తో పాటు ప్రకాష్ కుమార్ కి తెలుగమ్మాయి మాడ్ బ్యూటీ శ్రీ గౌరీప్రియ(శ్రీ గౌరీ ప్రియ)జత కట్టడం హ్యాపీ రాజ్ స్పెషల్. మరి మూవీ హ్యాపీని ఇచ్చిందా లేదా చూద్దాం

కథ

రాజ్ ఉరఫ్ హ్యాపీరాజ్(జీవీ ప్రకాష్‌) మధ్యతరగతికి చెందిన యువకుడు. ప్రతి రోజు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం. అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కొంత మంది కనెక్ట్ అయినా తన తండ్రి ముత్తు వల్ల (జార్జ్ మరియన్‌) పెళ్ళికి ఒప్పుకోరు. దాంతో తన తండ్రికి దూరంగా బెంగుళూరు వెళ్లి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ లో చేరతాడు. టీమ్ మేనేజర్ కావ్య(శ్రీ గౌరీ ప్రియ)ని చూసి ఇష్టపడతాడు. కావ్య కూడా రాజ్ ని ఇష్టపడుతుంది. కావ్య తండ్రి రాజేశ్(అబ్బాస్) రిచ్ పర్సన్. ప్రతి విషయంలోనూ స్టిట్ గా ఉండే వ్యక్తి. రాజ్, కావ్య పెళ్ళికి ఒప్పుకొని రాజ్ తో తన తల్లితండ్రులని తీసుకొని రమ్మంటాడు. దీంతో రాజ్ లో టెన్షన్ మొదలవుతుంది. తండ్రి వల్ల రాజ్ కి టెన్షన్ ఎందుకు? ముత్తు ఎవరు? ముత్తు వల్ల ఎందుకు పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతున్నాయి? ముత్తుకి ఉన్న ప్రాబ్లం ఏంటి? రాజ్, కావ్య చివరకి ఒక్కటయ్యారా లేదా? అనేదే హ్యాపీ రాజ్

ఎనాలసిస్
ఇలాంటి కథల్ని హీరోలు, మేకర్స్ ఓకే అనుకొని సెల్యులాయిడ్ పైకి రావాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. ఓల్డ్ ఫార్మాట్ కథ. తండ్రి వల్ల ప్రాబ్లమ్ అనేది కొంచం కొత్తగా ఉన్నా ఆ పాయింట్ కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పైగా ఓకే పాయింట్ పై కథనం నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటేనే రాజ్ లవ్ ఫెయిల్యూర్ అవ్వడం.. అందుకు తండ్రి కారణం అని చెప్పడంతో కొంచం ఇంట్రెస్ట్ గానే సాగింది. ఇక ఆ తర్వాత వెళ్లే కొద్దీ రొటీన్ సీన్స్. రాజ్ సీన్స్ లో ఓవర్ డోస్ ఎక్కువ అయినట్టుగా అనిపించినా ముత్తు సీన్స్ నవ్వులు పూయించాయి.

కథ బెంగుళూరుకి రాగానే కొంచం ఫ్రెష్ నెస్ వచ్చింది. కావ్య, రాజ్ మధ్య లవ్ సీన్స్ బాగా ఉన్నాయి. కావ్య తండ్రి రాజేష్ తో వచ్చిన సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్దగా పేలింది. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బెటర్ అనేలా సాగింది. సారీ చెప్పడం చుట్టూనే కథ మొత్తం రన్ అయ్యింది. పైగా డ్రామా. ఎంటర్ టైన్ మెంట్ కూడా వర్కౌట్‌ కాలేదు. క్లైమాక్స్ తో పాటు రాజ్ తన తండ్రి గొప్పతనం చెప్పే సీన్లు గుండెని బరువెక్కిస్తాయి. ఈ క్లైమాక్స్ నే హ్యాపీ రాజ్ ని కొంత వరకు కాపాడాయి.


నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు

హ్యాపీ రాజ్‌గా జీవీ ప్రకాష్‌ పెర్ఫార్మ్ సూపర్. ఆల్ వేరియేషన్స్ లోను టెంపో అనేది తగ్గకుండా మెస్మరైజ్ చేసి పడేసాడు. ముత్తుగా అలియాస్ గుర్రం గుడ్డుగా జార్జ్ మారియన్‌ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఒక పది ఆఫర్స్ మారియన్ కి వచ్చేంతల సమ్మోహన పరిచయం. కావ్యగా శ్రీ గౌరీప్రియ మరో సారి తన క్యూట్ అండ్ సింపుల్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకుంది. అబ్బాస్ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించి తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసాడు. మంచి కమ్ బ్యాక్ మూవీతో పాటు ఫాదర్ రోల్స్ లో బిజీ అవ్వడం ఖాయం. గీతా కైలాసంతో పాటు మిగిలిన ఆర్టిస్ట్ కూడా తమ రోల్స్ కి న్యాయం చేసారు. జస్టిన్‌ నుంచి వచ్చిన సాంగ్స్ తో పాటు బిజీఎం వర్క్ అవుట్ కాలేదు. మధన్ క్రిస్టోఫర్ ఫొటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. మరియా రాజా(మరియా రాజా) దర్శకుడిగా సక్సెస్ అయినా రచయితగా మెప్పించలేకపోయాడు.

బలాలు
ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్
ఎమోషనల్ సీన్స్
క్లైమాక్స్ ఎపిసోడ్

బలహీనతలు
కథ
కథనం
సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఎంటర్ టైన్ మెంట్ పండకపోవడం
సెకండాఫ్‌ సాగతీత

చివరిగా చెప్పాలంటే కథ, కధనం ఓల్డ్ ఫార్మెట్. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సూపర్

రేటింగ్ 2.25/ 5

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird