Home సినిమా రిసార్ట్ వెబ్ సిరీస్ రివ్యూ: రిసార్ట్ వెబ్ సిరీస్ రివ్యూ – Andhra Waves

రిసార్ట్ వెబ్ సిరీస్ రివ్యూ: రిసార్ట్ వెబ్ సిరీస్ రివ్యూ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


వెబ్ సిరీస్ : రిసార్ట్
నటీనటులు: లల్లూ, తలైవాసల్ విజయ్, ఎబి రాజన్, గిరి ద్వారకీష్, అబెనేయ నేత్రన్, విష్ణు బాల, సౌందర్య శరవణన్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్ విజయ్ కుమార్
ఎడిటింగ్: వి నితీష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఆర్ నరేష్ నారాయణన్
సంగీతం: రశాంత్ అశ్విన్
నిర్మాతలు: ఆర్ వెంకటేశ్ బాబు
దర్శకత్వం: ప్రవీణ్ బెన్నెత్
ఓటీటీ: జియో హాట్ స్టార్

కథ:

వెట్రి (విజయ్ కుమార్ రాజేంద్ర) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి తల్లి, చెల్లి ఇద్దరే ఉంటారు. తన పరిస్థితికి కారకుడైన తండ్రి అంటే అతనికి కోపం ఉంటుంది. తండ్రి చేసిన అప్పులను తీర్చవల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. అలా డిగ్రీ కూడా పూర్తిచేయలేక ఉద్యోగాన్ని వెతుక్కుంటూ బయల్దేరతాడు. అదే సమయంలో ‘ఉత్తమన్’, ‘మహాబలిపురం’లోని ఒక రీసాట్‌లో రూమ్ సర్వీస్ బాయ్ గా జాబ్ ఇస్తారు.

బీచ్ ఒడ్డునే ఉన్న ఖరీదైన రెసాట్ అది. రూమ్ సర్వీస్ బాయ్ గా అక్కడ ఉద్యోగం చేయడం అంత ఆషామాషీ విషయం కాదనేది ‘వెట్రి’కి అర్థమవుతుంది. అక్కడ కిచెన్ లో ‘చెఫ్’గా నెడుమారన్ (తలైవాసల్ విజయ్) పనిచేస్తుంటాడు. ఆయన టీం ను కూడా అక్కడి వాళ్లంతా చాలా ప్రత్యేకంగా చూస్తారు. రూమ్ సర్వీస్ బాయ్ లను కిచెన్ వైపు వెళ్లనీయరని తెలిసి వెట్రి బాధపడతాడు. మొదటి నుంచి కూడా అతనికి వంట చేయడం ఇష్టం. చెఫ్ గా పనిచేయడం ఇష్టం. ఆ కారణంగా కిచెన్ వైపు వెళ్లిన ప్రతీసారి అతను నెడుమారన్ తో చీవాట్లు తింటాడు. అదే కిచెన్ లో ఐశ్వర్య పనిచేస్తూ ఉంటుంది. తొలి చూపులోనే ఆమెను వెట్రి ఇష్టపడతాడు. అయితే ఆమె నెడుమారన్ కూతురని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆమెకి చేరువకావడం అనుకున్నంత తేలిక కాదనే విషయం అతనికి అర్థమైపోతుంది. నెడుమారన్ మాటకి ఆ రెసాట్ లో ఎదురుండదు. ఆయన అంటే అందరికి భయమే. ఆ రెసాట్ లో పనిచేసే మేనేజర్ రాజన్ నుంచి అంతా ఆయన మాటకి ఎస్ చెప్పాల్సిందే. అందుకు కారణం ఆ రెసాట్ యజమాని రఘుపతికి .. నెడుమారన్ కి మధ్య గల స్నేహమే. త్వరగా అప్పులు తీర్చడం కోసం వెట్రి రాత్రి వేళలో స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తాడు.

అతని కారణంగా ఆ బండి దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఒక రోజున కార్లో తనతో కలిసి అటుగా వచ్చిన నెడుమారన్, వెట్రి బండి దగ్గర ఆగి సూప్ టేస్ట్ చేసాడు. అది తన సిగ్నేచర్ సూప్ కావడంతో షాక్ అవుతాడు. తన సూప్ రెసిపీని కాపీ చేసిన వెట్రిపై కోపంతో రగిలిపోతాడు. మరోవైపున నెడుమారన్ కూతురు ఐశ్వర్య, తన స్నేహితులైన వేణి – శ్రీనిధితో కలిసి వెట్రిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ తండ్రీకూతుళ్ల కారణంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? రఘుపతి కూతురు రియా ఎంట్రీతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? వెట్రి తండ్రి ఎవరనేది మిగిలిన కథ.



విశ్లేషణ:

ఈ కథంతా ఓ రెసాట్ లో జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. నెడుమారన్, వెట్రి, రియా, ఉత్తమన్ పాత్రల చుట్టూ సాగే ఈ కథ మొదట్లో కాస్త బోర్ అనిపించినా ఎపిసోడ్ లు పూర్తయ్యే కొద్ది ఆసక్తికరంగా సాగింది. మొదటి నాలుగు ఎపిసోడ్లలో వెట్రి గతం, అతనికి కుకుంగ్ మీద ఉన్న ఆసక్తి, అప్పుల బాధలు, నెడుమారన్ , రియా పాత్రలని పరిచయం చేశాడు దర్శకుడు. ఎప్పుడు అయితే రాత్రి పూట నెడుమారన్ రోడ్డు సైడ్ బండి మీద సూప్ తాగుతాడో అప్పటి నుండి కథ ఆసక్తికరంగా సాగింది. అయితే వెట్రి ఒక రూమ్ బాయ్ కావడం వల్ల నెడుమారన్ కి అతను నచ్చాడు.

నెడుమారన్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాడంటే తన కూతురు ఇష్టాలు కూడా చెప్పలేకపోతుంది. అయితే వెట్రికి ఐశ్వర్య మధ్య లవ్ ఎప్పుడు మొదలైంది. వాళ్ళు కలుస్తారా.. ఐశ్వర్య వాళ్ళ నాన్న వెట్రిని అల్లుడిగా అంగీకరిస్తాడా.. అసలు వెట్రి వాళ్ళ నాన్నకి నెడుమారన్ కు సంబంధం ఏంటి అనే అంశాలు క్యూరియాసిటిని పెంచేశాయి.

సిరీస్ అంతా ఎంగేజింగ్ గా లేకపోయినా అలా టైం పాస్ కి ఒకసారి చూసేలా ఉంది. పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడం ఈ సిరీస్ కి మైనస్. ఎక్కువ పాటలేం.. ఫైట్లు కూడా లేవు. అలా అని కామెడీ కూడా లేదు. అడల్ట్ స్లీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. మొత్తానికి, రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథల మధ్య ‘రీసాట్’ ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. కాస్త నెమ్మదైన కథనం, వీకెండ్‌లో ప్రశాంతంగా ఒకసారి చూసేయొచ్చు.. నితీష్ కుమార్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. రశాంత్ అశ్విన్ మ్యూజిక్ బాగుంది. నరేష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.


నటీనటుల పనితీరు:

వెట్రిగా విజయ్ కుమార్ రాజేంద్ర చక్కగా నటించాడు. నెడుమారన్ గా తలైవాసల్ విజయ్ ఒదిగిపోయాడు. మిగిలిన వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.


ఫైనల్ గా : వన్ టైం వాచెబుల్

రేటింగ్: 2.5/ 5

✍️. దాసరి మల్లేశ్

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird