రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. దీన్ని సుమోటోగా తీసుకుని, ఏపీ ఎస్‌ఎస్, డీజీపీల’కు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది.
రాజమహేంద్రవరంలో కల్తీ పాల కారణంగా ఇప్పటి వరకూ 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతులలో పిల్లలు, వృద్ధులు ఉన్నారు. మొదట ఆరుగురు మరణించారు, ఆ తర్వాత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో పది మంది మరణించారు.
కల్తీ పాలు తాగి పలువురు మరణించడాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌గా తీసుకుంది. మనుషుల ప్రాణాలు పోయే దుస్థితి రావడానికి కరణాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక కోరింది. పాలను చేసే నిల్వ ఫ్రిజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం కలవడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
