Home Latest News గంభీర్‌పై నెట్టింట విమర్శల వెల్లువ | T20 వరల్డ్ కప్| ఇండియా vs సౌతాఫ్రికా మ్యాచ్| సూపర్ 8| క్రికెట్| క్రికెట్ వివాదం| కోచ్ గౌతమ్ గంభీర్| వాషింగ్టన్ సుందర్| అక్షర్ పటేల్| క్వింటన్ డి కాక్| ర్యాన్ రికెల్టన్| డేవిడ్ మిల్లర్| బీసీసీఐ| ICCI| వెస్టిండీస్ – Andhra Waves

గంభీర్‌పై నెట్టింట విమర్శల వెల్లువ | T20 వరల్డ్ కప్| ఇండియా vs సౌతాఫ్రికా మ్యాచ్| సూపర్ 8| క్రికెట్| క్రికెట్ వివాదం| కోచ్ గౌతమ్ గంభీర్| వాషింగ్టన్ సుందర్| అక్షర్ పటేల్| క్వింటన్ డి కాక్| ర్యాన్ రికెల్టన్| డేవిడ్ మిల్లర్| బీసీసీఐ| ICCI| వెస్టిండీస్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడింది. అయితే తుది జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుందర్ అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాల్లో తప్పిదాలపై మరోసారి చర్చ మొదలైంది.

భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ అక్షర్ పటేల్‌ను ఆడించకపోవడంపై స్పందించాడు. జట్టు ఎంపిక పూర్తిగా ‘కాంబినేషన్’ ఆధారంగా ఉంది. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌లో క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, డేవిడ్ మిల్లర్ వంటి ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో ఆఫ్ స్పిన్నర్ అవసరమని భావించామని చెప్పారు. పవర్‌ప్లెలో ఎడమచేతి బ్యాటర్లపై ప్రభావం చూపగల బౌలర్ అవసరమని, వాషింగ్టన్ ఆ దశలో బౌలింగ్ చేయగలడని భావించామని, అందుకే అక్షర్‌కు బదులుగా అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.

సౌతాఫ్రికా టాప్ ఆర్డర్‌లో ఎడమచేతి బ్యాటర్లను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం ఫలించలేదు. పవర్‌ప్లే లెక్కలు సరైనప్పటికీ, మధ్య ఓవర్లలో అక్షర్ లాంటి అనుభవజ్ఞుడి కొరత స్పష్టంగా కనిపించిందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుందర్ కంటే అక్షర్ పటేల్ అన్ని విషయాల్లోనూ బెటర్. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్‌కు ఎవరూ చెప్పలేదా? ప్రధాన కోచ్ ఇకనైనా తీరు మార్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird