స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఓ యువతి మరణించిన విషాదకరమైన అల్వాల్‌లో జరిగింది. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా నీటిలో మునిగి ఓ యువ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలానికి చెందిన బియారామ్ చౌదరి కుమార్తె వైష్ణవి (18) అల్వాల్‌లోని లయోలా కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు ఎన్‌సీసీ నేవీ వింగ్‌లో కూడా సభ్యురాలిగా కొనసాగుతోంది.
ఆమె సాయిబాబా నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో స్నేహి తులతో కలిసి నివాసం ఉంటుంది.ప్రతి రోజు మాదిరిగానే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్‌లోని వీవీ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ ప్రాక్టీస్‌కు వెళ్లేది. ఆదివారం కావడంతో కొంత ఆలస్యంగా సాయంత్రం 4.30 గంటలకు స్నేహి తులు గౌతమి, ప్రణీతతో కలిసి పూల్‌కు చేరుకుంది. స్నేహితులు కలిసి ఈత కొట్టారు.
ప్రాక్టీస్ ముగిసిన తర్వాత మిగిలిన స్నేహి తులు బయటకు వచ్చారు. అయితే వైష్ణవి, ప్రియాంక మాత్రం పూల్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో వైష్ణవి ఒక్కసారిగా కుప్ప కూలి నీటిలో మునిగిపో యింది. విషయం గమనించిన చిన ప్రియాంక వెంటనే కోచ్‌కు మరియు ఇతరులకు సమాచారం అందించింది. పూల్ సిబ్బంది వచ్చి వైష్ణవిని బయటకు తీశారు.
అయితే ఇప్పటికే ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదే స్విమ్మింగ్ పూల్‌లో గతంలో కూడా నలుగురు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకసారి పూల్‌ను సీజ్ కూడా చెప్పారు. ఘటన అనంతరం పూల్ యజమాని పరారీలో సమాచారం. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా ప్రమా ణాలు పాటించారా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
