టారిఫ్ల విషయంలో సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గలేదు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్డు చెప్పిన గంటల వ్యవధిలోనే ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వచ్చిన గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకాలు విధించిన ఆయన.. తాజాగా 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆ మేరకు సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. సుప్రీంకోర్డు తీర్పు క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అవి తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మున్ముందూ చట్టబద్దమైన టారిఫ్‌లు అమలు చేస్తామన్నారు. గతంలో తీసుకున్న దానికంటే ఎక్కువ టారిఫ్‌లు విధించేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన.. తాజాగా వాటిని 15 పెంచడం చర్చనీయాంశంగా మారింది.
.webp)