Home Latest News బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయా? అసలు నిజాలు ఏంటంటే! | బాదం గమ్ తినడం వల్ల మొటిమలు తగ్గుతాయా| బాదం చిగుళ్లను ఉపయోగించి మొటిమలు లేని చర్మం| ఆరోగ్యానికి బాదం పిసిన్ ప్రయోజనాలు| చర్మానికి బాదం వల్ల కలిగే ప్రయోజనాలు – Andhra Waves

బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయా? అసలు నిజాలు ఏంటంటే! | బాదం గమ్ తినడం వల్ల మొటిమలు తగ్గుతాయా| బాదం చిగుళ్లను ఉపయోగించి మొటిమలు లేని చర్మం| ఆరోగ్యానికి బాదం పిసిన్ ప్రయోజనాలు| చర్మానికి బాదం వల్ల కలిగే ప్రయోజనాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు. బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటారు. ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు, నీటిలో కలిపి తాగుతారు, ఇందులో సబ్జా, పంచదార కూడా కలుపుకుని తాగుతారు. వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయి కొందరు అంటుంటారు. దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే..

మొటిమలకు కారణం..

చర్మం మీద మొటిమలు, కురుపులు ఎండ వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. మందులతో పనిచేస్తుంది.

బాదం బంక.. చర్మ ప్రయజనాలు..

బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి. దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి. కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

బాదం బంక ఎందుకు మంచిది?

బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. బాదం బంకలో ఉండే ఆంట్-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరం లోపలి విషాన్ని తొలగిస్తుంది. మొటిమలు, ముడతలు, వడదెబ్బ వంటి సమస్యలను తగ్గించండి. బాదం బంక తినడం వల్ల చర్మానికి మెరుపు, యవ్వనం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird