Home Latest News సాఫ్ట్‌వేర్ సునీత డెడ్ బాడీ తీసుకెళ్లని భర్త…ఎందుకో తెలిస్తే షాకే! | సాఫ్ట్‌వేర్ సునీత హత్య| వనస్థలిపురం| పెద్దపల్లి జిల్లా| మహేష్| సునీత| కెనడా| శ్రీనాథ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| హైదరాబాద్ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

సాఫ్ట్‌వేర్ సునీత డెడ్ బాడీ తీసుకెళ్లని భర్త…ఎందుకో తెలిస్తే షాకే! | సాఫ్ట్‌వేర్ సునీత హత్య| వనస్థలిపురం| పెద్దపల్లి జిల్లా| మహేష్| సునీత| కెనడా| శ్రీనాథ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| హైదరాబాద్ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సునీత ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే… అయితే ఈ ఘటనలో షాకింగ్‌కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సునీత మొదటి భర్త ఆమెను హత్య చేయగా…. రెండవ భర్త ఆమె శవం వద్ద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి… పెద్దపల్లి జిల్లా మంథాని లో మహేష్, సునీతలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుమారు 8 సంవత్సరాలు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. బీటెక్ చదివిన మహేష్ 2019లో ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు.

ఆ తర్వాత కెనడాలో ఉద్యోగం వచ్చింది. దీంతో మహేష్, సునీత పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో అంగరంగ వైభవంగా 2022లో పెళ్లి చేసుకున్నారు… అయితే సునీతకు వీసా రాకపోవడం తో ఆమెను ఇంటి వద్ద ఉంచి తాను ఒక్కడే కెనడా వెళ్లిపోయాడు మహేష్. కెనడా వెళ్లిపోయిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో తరచూ గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వీసా రావడంతో సునీత కెనడాకు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన సునీతకు భర్త నుండి వేధింపులు మొదలయ్యాయి.. కేవలం 15 రోజులకే మధ్య గొడవలు పెరిగిపోవడంతో అవి భరించలేక తన భర్త వేధిస్తున్నాడంటూ సునీత కెనడా పోలీసుల సహాయంతో ఇండియాకి వచ్చింది.

అలా తల్లిదం డ్రుల వద్దకు వచ్చిన సునీత కెనడాలో ఉన్న భర్త పైన మంథనిలో ఉంటున్న అత్తమాలపైన మహారాష్ట్రలోని బల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు, విడాకుల కేసు పెట్టింది. కోర్టు విడాకులు ఇవ్వకముందే మహేష్, సునీత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు…. అనంతరం విడాకులు తీసుకున్న సునీత హైదరా బాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. 2024లో బేగంపేటకు చెందిన శ్రీనాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2025 ఏప్రిల్‌లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

అయితే ఆమెకు మహేష్‌తో పెళ్లైన విషయం శ్రీనాథ్ చెప్పలేదు. సునీత నాలుగు నెలల గర్భవతి… ఇదిలా ఉండగా మరోవైపు సునీత, మహేష్ పై పెట్టిన కేసుల కారణంగా మహేష్, అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చెట్టు తిరగాల్సి వచ్చింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక మహేష్ తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి మరణంతో ఇండియాకి వచ్చిన మహేష్ తిరిగి కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

కానీ సునీత పెట్టిన కేసుల వల్ల మహేష్ కు వీసా రాలేదు. ఒకవైపు తల్లి మరణం… మరోవైపు విదేశాలకు వెళ్లకుండా వీసా క్యాన్సల్….దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా మహేష్ సునీత ఉంటున్న నివాసానికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని చివరకు అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది…

మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిన భర్త

ఇక వైపు సునీత రెండో భర్త మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి నిరాకరించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తాను సునీతను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నానని ఇప్పటికే సునితకు మహేష్‌తో పెళ్లైన విషయం నాకు తెలియదని శ్రీనాథ్ వాపోయాడు. సునీత ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి మరో 5 నెలల్లో మాకు పాపం పుట్టబోతున్నారని ఎంతో ఆనందోత్సాహాలతో సృష్టించామని అన్నారు. అంతలోనే ఇంత దారుణం జరిగింది శ్రీనాథ్ కన్నీరు పెట్టుకున్నాడు. తన భార్య మొదటి పెళ్లి గురించి చెప్పకుండా దాచిపెట్టి తన ను మోసం చేసిందని… ఈ బాధతోనే సునీత మృత్యువును తీసుకువెళ్లడానికి శ్రీనాథ్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird