Home సినిమా మహేష్ బాబు శ్రీరాముడి పిక్ లీక్!. వారణాసి కోసం ఎదురుచూపులు – Andhra Waves

మహేష్ బాబు శ్రీరాముడి పిక్ లీక్!. వారణాసి కోసం ఎదురుచూపులు – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


వారణాసి లో మహేష్ శ్రీరాముడిగా చేస్తున్న విషయం తెలిసిందే
సోషల్ మీడియాలో సదరు శ్రీరాముడు పిక్ వైరల్
వేదికగా నిలిచిన గుంటూరు

మహేష్ బాబు(మహేష్ బాబు),రాజమౌళి(Ss Rajamouli)పుణ్యమా అని ‘వారణాసి'(Varanasi)వరల్డ్ సినిమాగా రూపాంతరం చెందింది. మేకర్స్ అందుకు తగ్గట్టే ప్రపంచ స్థాయి ప్రమాణాలకి అనుగుణంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘వారణాసి’ ని ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ క్యారక్టరయిజేషన్ ఎవరి ఊహకి అందని విధంగా ఉండబోతుంది. అందుకు నిదర్శనంగా మెడలో రుద్రాక్షని ధరించే శివభక్తుడైన ‘రుద్ర’ తో పాటు శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు.ఆ రెండు అంశాలు చాలు. మహేష్ క్యారక్టర్ ఎవరి ఊహలకి అందని విధంగా ఉండబోతుందని చెప్పడానికి. దీంతో అభిమానులు శ్రీరాముడిగా మహేష్ ఎలా ఉంటాడో అనే ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో శ్రీరాముడిగా మహేష్ గెటప్ వైరల్ అవుతుంది.ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

గుంటూరులోని మైత్రీ సినిమాస్‌(మైత్రీ మూవీ మేకర్స్)కి సంబంధించిన ఒక థియేటర్‌లో ‘వారణాసి’ లో మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న డిజిటల్ పోస్టర్‌ని ఏర్పాటు చేశారు.ధనుస్సు ధరించి ఉన్న లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రాజమౌళి అధికారకంగా శ్రీరాముడిగా మహేష్ లుక్ ని రివీల్ చేయలేదు.ఒక వేళ లీక్ అయిందేమో అని అనుకున్నా మైత్రి వారు సుదీర్ఘ కాలం నుంచి అగ్ర నిర్మాతలుగా ఉన్నారు. దీనితో లీక్ లని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరగని పని. కాబట్టి ఊహించి ఏర్పాటు చేసిన గెటప్ అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినబడుతున్నాయి. అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తుంది కాబట్టి రాజమౌళి, మహేష్ వద్దకు ఆ పిక్ న్యూస్ ఎవరి రికమండేషన్ లేకుండానే వెళ్లడం ఖాయం. ఆ ఇద్దరు స్పందించడం ఖాయం.

కూడా చదవండి: బైకర్: బిజినెస్ డీల్ ఇదేనా! మరి శర్వానంద్ నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి

ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్‌తో పాటు వరల్డ్ మేటి నటులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వారణాసి 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. విజయేంద్ర ప్రసాద్(విజయేంద్ర ప్రసాద్)కథ అందించిన కీరవాణి సంగీత దర్శకుడు అనే విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird