Home సినిమా పూరి జగన్నాథ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరల్! – Andhra Waves

పూరి జగన్నాథ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరల్! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


– అలా ప్రపంచంలో ఎవరూ చేయలేరు

– ఆ డైలాగ్స్‌ని ‘దబాంగ్’ సినిమాలో వాడుకున్నారు

– నా క్యారెక్టర్ గురించి చెప్పినపుడు షాక్ అయ్యాను

టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన సినిమాలు, అందులోని హీరో క్యారెక్టర్, డైలాగులు, టేకింగ్.. అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన పూరి.. ప్రభాస్‌(ప్రభాస్)తో ‘ఏక్‌నిరంజన్’ అనే సినిమా చేశారు. తమ కాంబినేషన్‌లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయనీ, ఆ రెండు సినిమాల్లో తన క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారని ప్రభాస్ చెబుతున్నారు. పూరి రాసే డైలాగులు, క్యారెక్టర్ డిజైనింగ్ ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయలేరని ప్రభాస్ అప్రిషియేట్ చేశారు. ఆయన సినిమాల్లోని డైలాగులు ఎంతో నేచురల్‌గా ఉంటాయని, ఆయన రైటింగ్ స్టెయిల్‌ని ఎవరూ ఇమిటేట్ చేయలేరు అన్నారు.

‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌తో కలిసి హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మానస వారణాసి ఓ ఇంటర్వ్యూ జరిగింది. హీరో సంతోష్ ఏక్‌నిరంజన్ తన ఫేవరేట్ సినిమా అని చెప్పాడు. అందులో ప్రభాస్ డైలాగ్ డెలివరీ తనకు బాగా నచ్చుతుందని సంతోష్ అన్నాడు. ఏక్‌నిరంజన్ గురించి చెప్పడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రభాస్ చెబుతూ ‘బుజ్జిగాడు సినిమాలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పటి వరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఎలా చెయ్యాలి అని టెన్షన్ పడ్డాను. అయితే నా క్యారెక్టరైజేషన్, నేను రాసిన డైలాగ్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో ఎక్సైట్ అయ్యాను.

ఆ టైంలో ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడి క్యారెక్టర్‌లాగే మాట్లాడేవాడిని. పూరిగారిలా డైలాగ్స్ రాసేవారు నా ద ష్టిలో ప్రపంచంలోనే ఎవరూ లేరు. ‘ఏక్ నిరంజన్’లో నేను ఏడ్చే సీన్ ఒకటి ఉంటుంది. ‘మగవాళ్లు కూడా ఏడుస్తారా’ అని హీరోయిన్ అంటే, ‘బాధ వస్తే ఎవడైనా ఏడుస్తారా’ అని అంటాను. అది నా ఫేవరేట్ సీన్. ఆ సినిమాలో విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అందులోని డైలాగ్స్ ‘దబాంగ్’ సినిమాలో వాడారు. పూరిగారికి సోనూ సూద్ కాల్ చేసి ఆ డైలాగ్స్ పెట్టుకుంటామని అడిగాడు. పెట్టుకోమని కూల్‌గా చెప్పారు’ అంటూ పూరి జగన్నాథ్ గురించి ఎవరూ చెప్పని విధంగా ప్రభాస్ చెప్పారు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird