Home సినిమా Bookie Movie Review : బుకి మూవీ రివ్యూ – Andhra Waves

Bookie Movie Review : బుకి మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo



సినిమా పేరు:బూకి
న‌టీన‌టులు: అజ‌య్ దిశ,ఆర్కే ధనుష, సునీల్, లక్ష్మి మంచు, పాండియరాజన్, షియారా సంభవించాయి
ఎడిటింగ్, మ్యూజిక్: విజయ్ ఆంటోనీ
నిర్మాత: రామంజేయులు జవ్వాజీ
సమర్పణ: విజయ్ ఆంటోనీ
బ్యానర్: శరవంత్ రామ్ క్రియేషన్స్
రచన, ఫొటోగ్రఫీ, దర్శకత్వం: గణేష్ చంద్ర
విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2026

సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్థుడైన విజయ్ ఆంటోనీ(విజయ్ ఆంటోనీ)సమర్పణలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం ‘బూకి'(బుకీ).తమిళ్ లో గత శుక్రవారం రిలీజ్ అవ్వగానే పర్వాలేదనే టాక్ తో రన్ అవుతుంది. అజయ్ డిషన్,ఆర్కే ధనుష జంటగా చేసారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
కైలాష్(అజయ్ డిషన్) ఆషా(ఆర్కే ధనుష) ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటారు. ఇద్దరు కలిసి ఎన్నో ప్రదేశాలకి తిరగడం, ఒకరి ఇష్టాలని ఒకరు అలవాటు చేసుకోవడంతో పాటు జీవితానికి సరిపడ ఎంజాయ్ మెంట్ చేసి ఉంటారు. ఇద్దరి మనసు కూడా చాలా మంచిది. కానీ బ్రేక్ అప్ చెప్పుకుంటారు. వన్ ఇయర్ తర్వాత కైలాష్ తన జీవితంలోకి కావ్య అనే యువతిని, రాహుల్ అనే యువకుడిని ఆషా లు ఏరి కోరి ఎన్నో ఛాయస్ ల తర్వాత ఆహ్వానిస్తారు. వన్ ఇయర్ తర్వాత ఆ ఇద్దరు వేరే కొత్త పార్టనర్స్ ని తమ లైఫ్ లోకి ఎందుకు ఇన్వైట్ చేసారు? ఆ వన్ ఇయర్ పాటు ఏం చేసారు? బ్రేక్ అప్ ఎందుకు అయ్యారు? అసలు ఆ మధ్య ఏడు సంవత్సరాలు ఉన్న రిలేషన్ ప్రేమనా లేక టైం పాస్ నా అనేదే బూకి.

ఎనాలసిస్
సెల్యులాయిడ్ పై బూకి ద్వారా మరో యూత్ ఎంటర్ టైనర్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం కొంత మంది ఇగో తో తమలో ఉన్న నిజమైన ప్రేమని మోసం ఎలా అయితే వేరే వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారో చూపించింది. అదే టైంలో నిజమైన ప్రేమని మరిచిపోలేమని చెప్పారు. మేకర్స్ తెలివిగా ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా సీన్స్ ని క్రి యేట్ చేసినా ఒకరికొకరు మర్చిపోలేకపోవడం అనేది కమర్షియల్ గా చెప్పింది. ఈ విషయంలో బూకి కి కొంచం మైనస్ గా పరిగణించవచ్చు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ కైలాష్, ఆషా లు బ్రేక్ అప్ చెప్పుకోవడంతో కథలోకి లీనమవుతాం. ఆ తర్వాత రివర్స్ స్క్రీన్ ప్లే తో సీన్స్ వచ్చి మెస్మరైజ్ చేస్తోంది.

తమ మనసులో ఉన్న వారిని మర్చిపోవడం కోసం కైలాష్, ఆశలు పడే ఇబ్బందులు, ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగానే ఉన్నాయి.ఇద్దరి ఫ్యామిలీ కి సంబంధించిన సీన్స్ పర్లేదు. వికాస్ వైబ్స్ ధ్యాన మందిరంలో వచ్చిన సీన్స్ పర్లేదు. ట్విస్ట్ బాగుంది.సెకండ్ హాఫ్‌లో ఏమైనా కొత్త కథ వస్తుందేమో అనుకుంటే కైలాష్, ఆషా మధ్య మరో కోణాన్ని చూపించి కావ్య, రాహుల్ అనే క్యారెక్టర్‌తో కలిసి వెళ్లారు.ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ రొటీన్‌గా ఉన్నాయి.

ఆ విధంగా కైలాష్, ఆషా తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని, తాము మానసికంగా చాలా బలవంతులమని నిరూపిస్తామని చెప్పి ఉండాల్సింది. అందులో భాగంగా ఒకరికొకరు కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేసి విడిపోదామని ఫిక్స్ అయ్యి ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి కథనం రన్ అయ్యి ఉంటే బూకి హిట్ పొజిషన్ మరోలా ఉండేది. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ రాలేదు. కైలాష్, ఆషా క్యారెక్టర్స్ మధ్య ఉన్న సంఘర్షణని వెంటనే ముగించినట్టుగా ఉంది.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
అజయ్ డిషన్(అజయ్ ధిషన్),ఆర్కే ధనుష(ఆర్కే ధనుష)తమ క్యారలలో పోటాపోటీగా పెర్ ఫార్మ్ ప్రదర్శించారు. అసలు కైలాష్, ఆషా క్యారెక్టర్స్ తమ కోసమే పుట్టాయేమో అనేలా మెస్మరైజ్ చేసారు. మూవీకి ఉన్న ప్రధాన బలాల్లో ఆ ఇద్దరు ఒక కారణం. సునీల్, మంచు లక్ష్మి, షియారా, ధనుష్ ఫ్రెండ్ గా చేసిన వాళ్ళందరు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా కైలాష్, ఆర్కే ధనుష్ తల్లి తండ్రులుగా చేసిన వాళ్ళు పర్లేదు. విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన సాంగ్స్, బిజిఎం అయితే మరో లెవల్. బూకి కి సరికొత్త ఫ్రెష్ నెస్ ని తెచ్చాయి. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.కెమరామెన్ గా, దర్శకుడిగా గణేష్ చంద్ర(గణేష్ చంద్ర)మెరుపులు మెరిపించాడు.రచన పరంగా చాలా లోటుపాట్లని నింపాడు. విజయ్ ఆంటోనీ నుంచే వచ్చిన ఎడిటింగ్ కూడా సూపర్ గా ఉంది



ఫైనల్ గా హీరో, హీరోయిన్ ల పెర్ఫార్మ్ తో పాటు డైరెక్షన్ బాగుంది. కథనం పరంగా సెకండ్ హాఫ్ పెద్దగా మెప్పించలేదు.

బలాలు
1 . హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్
2 . మ్యూజిక్
3 . ఫోటోగ్రఫీ
4 . డైరెక్షన్

బలహీనతలు
1 . కథలో గ్రిప్ లేకపోవడం
2 .సెకండ్ హాఫ్
3 .ఓకే పాయింట్ పై కథ నడవడం
4 . క్లైమాక్స్

రేటింగ్ 2 .25/5

అరుణాచలం

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird