సాధారణంగా మన ఇళ్లలో వాడే బియ్యం కిలో రూ. 50 రూ. 150 వరకు ఉంటుంది. బాస్మతి రకం బియ్యం అయితే అదనంగా మరో వంద ఉంటుంది. అయితే కిన్‌మెమాయ్ ప్రీమియం అంటే ఒక ప్రత్యేక రకమైన బియ్యం. దీని ధర వింటే కళ్లుబైర్లు కమ్మాల్సిందే. జపాన్‌కు చెందిన ఈ కిలో బియ్యం కొనాలంటే ఒక బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనేంత డబ్బు వెచ్చించాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
టోయో రైస్ కార్పొరేషన్ ఖరీదైన ఈ బియ్యాన్ని జపాన్ ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు లభించింది. మార్కెట్‌ను బట్టి కిలో బియ్యం ధర సుమారు 12 వేల 500 రూపాయల నుండి పదిహైను వేల రూపాయల వరకు ఉంటుంది. కేవలం ధర మాత్రమే కాదు, దీన్ని పండించే విధానం, ప్రాసెసింగ్ పద్ధతి కూడా విలక్షణంగా ఉంటాయి. కిన్‌మెమాయ్ ప్రీమియం బియ్యం అనేది ఏదో ఒక రకమైన బియ్యం కాదు. జపాన్‌లోని గున్మా, నాగనో, నీగాటా వంటి ప్రాంతాలలో పండే కోషిహికారీ, పికామారు వంటి ఐదు రకాల మేలైన బియ్యం రకాలను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ కలయిక దాని ప్రత్యేకతకు ప్రధాన కారణం.
దీని కీలక ఉత్పత్తిలో ఆరు నెలల నిరీక్షణ పాత్ర పోషిస్తుంది. బియ్యం కోత కోసిన వెంటనే మార్కెట్లోకి రావు. వీటిని దాదాపు ఆరు నెలల పాటు ప్రత్యేక పరిస్థితులలో నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల బియ్యం రుచి, ఆకృతి మెరుగుపడతాయని టోయో రైస్ కార్పొరేషన్ చెబుతోంది. ఇది దాని ప్రత్యేక రుచికి, నాణ్యతకు పునాది వేస్తుంది. ప్రత్యేక పాలిష్ విధానం కూడా కిన్‌మెమాయ్ ప్రీమియం బియ్యానికున్న మరో ప్రత్యేకత. దీని కోసం పేటెంట్ పొందిన ఒక ప్రత్యేకమైన బఫింగ్ ప్రక్రియను ఉపయోగించారు. ఈ బియ్యం పద్ధతి పైపొరను తొలగించండి, అందులోని ముఖ్యమైన పోషక విలువలు ఏమాత్రం నష్టపోకుండా కాపాడుతుంది. దీని వల్ల బియ్యం సహజసిద్ధమైన మంచి గుణాలను నిలుపుకుంటుంది.
అద్భుతమైన రుచితో అలరారే ఈ బియ్యంతో అన్నం వండితే అది స్పటికంలా మెరుస్తుంది. దీని రుచి కొంచెం తియ్యగా, వెన్నలాగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుందని బియ్యం రుచి చూసిన భోజన ప్రియులు చెబుతారు. ఈ ప్రత్యేకమైన రుచి అనుభవం దీనిని సాధారణ బియ్యం వేరు చేస్తుంది. కిన్‌మెమాయ్ ప్రీమియం బియ్యం లగ్జరీ గిఫ్ట్‌గా ప్రసిద్ధ పొందింది. టోయో రైస్ ఏడాదికి కేవలం 1000 బాక్సులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిమిత ఉత్పత్తి దాని విలువను మరింత పెంచుతోంది. జపాన్‌లో దీన్ని ప్రతిరోజూ తినే ఆహార పదార్థంగా కాకుండా, అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కానుకగా ఇతరులకు ఇస్తారు. ఒక సాధారణ ఆహార పదార్థం కూడా సరైన నైపుణ్యం, ప్రత్యేక పద్ధతులు తోడైతే ఎలా గిన్నిస్ రికార్డు సృష్టిస్తుందో చెప్పడానికి కిన్‌మెమాయ్ ప్రీమియం ఒక నిదర్శనం.
