బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. గతంలో తెలంగాణ జాగృతి వేదికగా రాజకీయాలు చేస్తున్న కల్వకుంట్ల కవిత సొంతంగా ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి ముహూర్తం కూడా ఖరారు చేశారు. గురువారం హైదరాబాద్ జబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది మే మొదటి వారం తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న ఎన్నికల అసెంబ్లీలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసింది.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు. ఇక రెండో చాయిస్ బోధన్ అని చెప్పిన కవిత.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తన పార్టీ పేరు ఉంటుందన్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనం బాట అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా కవిత పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్‌కు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మద్దతుదారులను ఐఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేసి తమ ఉనికిని చాటుకున్నారు
.webp)