Home సినిమా ఈ వారం థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు! – Andhra Waves

ఈ వారం థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


జనవరిలో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంది కానీ, ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న సినిమాలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గత వారం ‘ఫంకీ’, ‘కపుల్ ఫ్రెండ్లీ’, ‘సీతా పయనం’ వంటి సినిమాలు విడుదల కాగా ఈ వారం ‘హే బల్‌వంత్’, ‘నవాబ్ కేఫ్’ సినిమాలు విడుదలవుతున్నాయి.

హే బల్వంత్: (హే బల్వంత్)
సుహాస్, శివాని నగరం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో రూపొందించిన మూవీ ‘హే బల్‌వంత్’. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ, ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెడుతోంది. అసలు ఈ చిత్ర టైటిల్ ‘హే భగవాన్’ కాగా.. సెన్సార్ అభ్యంతరం తెలపడంతో చివరి నిమిషంలో ‘హే బల్వంత్’గా మార్చారు. హీరో ఫ్యామిలీ చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటి? అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

నవాబ్ కేఫ్: (నవాబ్ కేఫ్)
శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం కూడా మొదట అనుకున్న టైటిల్ ‘చాయ్ వాలా’. సెన్సార్ అభ్యంతరంతో ‘నవాబ్ కేఫ్’గా మారింది. విదేశాలకు వెళ్ళాలి, గొప్పగా బతకాలని కలలు కనే చాయ్ వాలా కొడుకు కథగా ఇది ప్రదర్శించబడింది.

ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, శ్రీ చిదంబరం గారు వంటి సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.

ఈటీవీ విన్:
శ్రీ చిదంబరం గారు మూవీ – ఫిబ్రవరి 19

నెట్ ఫ్లిక్స్:
చథా పచ్చ మూవీ – ఫిబ్రవరి 19

ప్రైమ్ వీడియో:
‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ – ఫిబ్రవరి 19

జీ5:
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ – ఫిబ్రవరి 20
రాక్షస వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 20

జియో హాట్ స్టార్:
లక్కీ ది సూపర్ స్టార్ మూవీ – ఫిబ్రవరి 20

ఇది కూడా చదవండి: ప్రభాస్ గురించి వినిపిస్తున్న షాకింగ్ న్యూస్ నిజమేనా?

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird