Home Latest News ఆ లింకులు తొలగించండి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం | డిలీట్ థౌజ్ లింక్స్ ఢిల్లీ కోర్టు డైరెక్ట్ సాక్షి మీడియా| వారసత్వం| ఆహారాలు| పరువు నష్టం – Andhra Waves

ఆ లింకులు తొలగించండి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం | డిలీట్ థౌజ్ లింక్స్ ఢిల్లీ కోర్టు డైరెక్ట్ సాక్షి మీడియా| వారసత్వం| ఆహారాలు| పరువు నష్టం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియా సంస్థకు చుక్కెదురైంది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వివాదస్పద కథనాలకు సంబంధించిన లింకులను తక్షణమే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా డెయిరీ నెయ్యి వివాదంతో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధం ఉందంటూ సాక్షి మీడియాలో ప్రచురితమైన కథనాలు పూర్తి అవాస్తవాలని ఆరోపిస్తూ హరితేజ్ ఫుడ్స్ హైకోర్టును ఆశ్రయించింది.

ఆ కథనాలు తమ సంస్థ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయనీ, అవన్నీ సత్యదూరాలనీ ఆనందూ హెరిటేజ్ ఫుడ్స్ వందకోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. భోలేబాబా డెయిరీతో తనకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవనీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి తాము నెయ్యి సరఫరా చేయడం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, 24 గంటల్లోగా సదరు కథనాల లింకులను అన్ని వేదికల నుంచి తొలగించాలని సాక్షి మీడియాను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ తొలగించకపోతే.. ఆ లింకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలకు సూచించింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird