ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 24న భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్‌ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24 మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుందని సీఎస్ విజయానంద్ బుధవారం (ఫిబ్రవరి 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్‌లో 23వ తేదీల్లోగా పంపాలని అన్ని శాఖల ప్రధానదర్శులకు అధికారిక సమాచారం. ఇలా ఉండగా ఈ కేబినెట్ భేటీలో పలు కీలక చర్చిచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
