సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం కింద ముస్లింలకు అమల్లో ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బీజేపీ హామీని మహాయుతి ప్రభుత్వం మంగళవారం(ఫిబ్రవరి 17) రాత్రి జీవో జారీ చేసింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు వర్తించే ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
2014లో అప్పటి నుండి డెమోక్రటిక్ ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పట్లో ఈ ఆర్డినెన్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి. 2014 నవంబర్ 14న హైకోర్టు ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లపై మధ్యంతర స్టే విధించింది. తరువాత ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు తీర్పులు, న్యాయ అడ్డంకుల కారణంగా రిజర్వేషన్ పూర్తిగా అమలులోకి రాలేదు. డిసెంబర్ 23, 2014 నాటికి శాసనసభ ఆ ఆర్డినెన్స్‌ను చట్టంగా ఆమోదించిన గడువు ముగిసింది.
అయినప్పటికీ అధికారికంగా రద్దు ప్రకటన లేకపోవడంతో ఈ రిజర్వేషన్ అంశం ఎటూ తేలకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉండీ లేనట్లుగా కొనసాగుతోంది. దాదాపు పుష్కర కాలం తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ అనుమతిని మహాయుత ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. చట్టపరంగా అమలులో లేని కోటాని రద్దు చేసింది. అలా రద్దు చేస్తూ, ఇది కేవలం సరైన స్పష్టత కోసం తీసుకున్న నిర్ణయమేనని, అమలులో లేని అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేశామని.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ముస్లింలకు పెద్ద దెబ్బ. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని అడ్డుకుంటుందని విమర్శించింది. ఎంఐఎం అయితే దీనికి రంజాన్ తోఫాగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముస్లింల రిజర్వేషన్ అంశం మళ్లీ రాజకీయంగా ప్రధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో రానున్న ఎన్నికలలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
.webp)