Home Latest News తెలిసి తెలిసి తప్పుడు ఆరోపణలు.. వైసీపీ నైజం అదేనా? | తప్పుడు ఆరోపణలే వైసీపీ స్వభావం| లోకేష్| కొలంబో| యాత్ర| ఖర్చు| జగన్| fpriegn – Andhra Waves

తెలిసి తెలిసి తప్పుడు ఆరోపణలు.. వైసీపీ నైజం అదేనా? | తప్పుడు ఆరోపణలే వైసీపీ స్వభావం| లోకేష్| కొలంబో| యాత్ర| ఖర్చు| జగన్| fpriegn – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


జనం సొమ్ముతో జల్సాలు అంటూ కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మంత్రి పోటీని వీక్షించడానికి మంత్రి లోకేష్ పై వైసీపీలు వెళ్లి లోకేష్ ఫ్లైట్ టికెట్టు నాదే.. మ్యాచ్ టికెట్టు నాదే… నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తాను.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తా.. అంటూ తనదైన స్టైల్ లో స్పందించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొలంబో మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి లోకేశ్ ప్రభుత్వ ధనంతో వెళ్లాలనే వార్తలో ఎలాంటి వాస్తవం స్పష్టత ఇచ్చింది.

వాస్తవంగా ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా దిగజారింది. టీమ్ ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి కొలంబోన లోకేష్ అందుకైన ఖర్చు మొత్తం స్వయంగా భరించారు, రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అయితే వైసీపీ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది. అయితే ఫ్యాక్ట్ చెక్ లో వైసీపీ ప్రచారమంతా అవాస్తవమని విస్పష్టంగా తేలింది. రాష్ట్ర ఖజానా నుంచి లోకేష్ కొలంబో పర్యటనకు ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని తేటతెల్లమైపోయింది. గతంలో కూడా తన సొంత పర్యటనల కోసం ప్రభుత్వం సొమ్ము వినియోగించడం లేదని పలు సందర్భాల్లో లోకేష్ చెప్పారు. అయినా వైసీపీ విమర్శలు చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా దిగజారుతోంది.

మసిగుడ్డ మీదేస్తాం.. మీరే తుడుచుకోండి అన్న చందంగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో జగన్ అధికారంలో ఉండగా… ఆయన సతీసమేతంగా విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వినియోగించిన సందర్భాలను పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో తన పెద్ద కుమార్తె హర్ష ప్యారిస్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఈ) పూర్తి చేసిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ రెడ్డి సతీ సమేతంగా ప్యారిస్ వెళ్లారు. తన కుమార్తె పట్టా పుచ్చుకునే వేడుకను చూడాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. అయితే అందుకోసం ఆయన ప్యారిస్ వెళ్లడానికి జనం సొమ్ము ఖర్చు చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన పరిస్థితిని పరిశీలకులు చెబుతున్నారు.

అప్పటి ఆయన పారిస్ పర్యటన నాలుగు రోజులు సాగింది. ఇందు కోసం రానూ పోనూ విమాన ఖర్చులే రూ.10 కోట్లు అని అప్పట్లో గట్టిగా వినిపించింది. అప్పట్లో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు సమయానికి చెల్లించే పరిస్థితి కూడా లేదు. అలాగే సంక్షేమ పథకాలకే ప్రభుత్వం కోట పెడుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ సొమ్ము రూ. 10 కోట్లు ఖర్చు చేయడాన్ని జగన్, ఆయనపార్టీ నేతలూ ఎలా సమర్థించుకోగలరని ప్రశ్నిస్తున్నారు. తన హయాంలో జనం సొమ్మును జగన్ పాకెట్ మనీగా వాడుకున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird