Home Latest News పంజాగుట్టలో కిలో బంగారం చోరీ చేసిన దొంగ అరెస్టు | జాయ్ అలుకాస్ పంజాగుట్టలో చోరీ| బంగారు బిస్కెట్లు| పంజాగుట్ట పోలీస్| సీఎం రేవనర్థరెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు – Andhra Waves

పంజాగుట్టలో కిలో బంగారం చోరీ చేసిన దొంగ అరెస్టు | జాయ్ అలుకాస్ పంజాగుట్టలో చోరీ| బంగారు బిస్కెట్లు| పంజాగుట్ట పోలీస్| సీఎం రేవనర్థరెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణం జాయ్ అలుకాస్‌లో చోరీ జరుగుతున్నట్లుగా నిన్న యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేదించారు. పోలీసుల దర్యాప్తులో షాపులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను క్రమంగా అపహరించిన ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఆదివారం 15వ తేదీన జై అలుకాస్ యజమాని తన షాప్‌లో బంగారు బిస్కెట్లు చోరీలుగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దొంగతనానికి రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగిన ఉద్యోగి అసలు రంగు బయటపెట్టారు. పంజాగుట్ట సంబంధిత ఉద్యోగి జాయ్ అలుకాస్ షాపులో పనిచేస్తూ ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా అతి జాగ్రత్తగా రోజుకు కొద్దికొద్దిగా ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. షాపులో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరే కావడంతో అతనిపై ఎలాంటి అనుమానం కలగలేదు. అయితే స్టాక్ తనిఖీల సమయంలో ఆభరణాలు మిస్సింగ్‌గా గుర్తించిన యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది.

సీసీటీవీ ఫుటేజ్‌లు, స్టాక్ రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు జాయ్ అలుకాస్ యాజమాన్యం నిర్ధారించింది. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన సమాచారంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1,65,00,000 రూపాయల విలువ చేసే 10 బంగారు బిస్కెట్లు, ఒక బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కలకలం రేపగా, షాపింగ్ మాల్స్ మరియు ఆభరణాల దుకాణాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird