Home Latest News సకుటుంబ సమేతంగా కనుల`విందు` | మంత్రి నారా లోకేష్‌తో ఆంతరంగిక భేటీ| విజయవాడ పార్లమెంట్| మంగళగిరి| కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్| మంత్రి నాదెండ్ల మనోహర్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| కూటమి నేతల విందు సమావేశం – Andhra Waves

సకుటుంబ సమేతంగా కనుల`విందు` | మంత్రి నారా లోకేష్‌తో ఆంతరంగిక భేటీ| విజయవాడ పార్లమెంట్| మంగళగిరి| కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్| మంత్రి నాదెండ్ల మనోహర్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| కూటమి నేతల విందు సమావేశం – Andhra Waves

by andhra andhrawave
0 comments
సకుటుంబ సమేతంగా కనుల`విందు` | మంత్రి నారా లోకేష్‌తో ఆంతరంగిక భేటీ| విజయవాడ పార్లమెంట్| మంగళగిరి| కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్| మంత్రి నాదెండ్ల మనోహర్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| కూటమి నేతల విందు సమావేశం


ప్రజాప్రతినిధులంతా సకుటుంబంగా తరలిరావడంతో మధ్యాహ్నం వేళ ఆత్మీయ కలయిక కనుల విందుగా జరిగింది. ఉండవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం గుంటూరు, విజయ’వాడ పార్లమెంటు నియోజక‌వర్గాల ప‌రిధి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ స‌భ్యుల‌తో మంత్రి నారా లోకేష్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యులను స్వాగతించిన లోకేష్, వారితో ఆత్మీయంగా మాట్లాడారు. చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబ విషయాలు, బాగోగులు, విద్య, క్రీడల గురించిన అర్థవంతమైన చర్చలు సాగాయి. చదువు, కెరీర్ ఒక్కటే జీవితం అని అందరూ అనుకుంటున్నారని, స్పోర్ట్స్ కూడా కెరీర్ గా పిల్లలు ఎంచుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని లోకేష్ సూచించారు. అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ, మాట్లాడుకున్నారు. మొత్తం నాయకులంతా తమ కుటుంబాలతో తరలి రాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనాల కనుల`విందు`గా సాగింది. లీడర్లు తనకు ఇచ్చిన వినతుల లేటెస్ట్ స్టేటస్ రిపోర్టు లోకేష్ స్వయంగా వారికి ఏర్పాటు. తన నియోజకవర్గమైన మంగళగిరి చేనేతను ప్రమోట్ చేయడంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదలని మంత్రి నారా లోకేష్.. ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందించారు.

ఈ ఆత్మీయ కలయికకు గుంటూరు ఎంపీ -కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , పౌరస‌రఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ (తెనాలి-జ‌న‌సేన‌), ఎమ్మెల్యేలు తెనాలి శ్రావ‌ణ్ కుమార్ (తాడికొండ‌), ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్ (పొన్న‌జ‌రు), పాడు పాడు (గుంటూరు వెస్ట్), నసీర్ అహ్మద్ (గుంటూరు ఈస్ట్), ఆలపాటి రాజేంద్రప్రసాద్ (ఎమ్మెల్సీ), విజయ’వాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య (నందిగామ’), శ్రీరాం రాజగోపాల్ (జగ్గ’పూడి’పేట), వ’సంతాక కృష్ణప్రమైకసాద్), (తిరువూరు), బొండా ఉమామహేశ్వర రావు (విజయవాడ సెంట్ర‌ల్) , గద్దె రామమోహన రావు (విజయవాడ ఈస్ట్‌), పంచుమర్తి అనురాధ (ఎమ్మెల్సీ) కుటుంబ స‌భ్యుల‌తో హాజ‌ర‌య్యారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird