Home Latest News హైదరాబాద్‌లో అడ్వకేట్ దారుణ హత్య | రంగారెడ్డి జిల్లా| రాజేంద్ర నగర్| అత్తాపూర్ పోలీస్ స్టేషన్| ముహమ్మద్ ఖాదిర్| క్లూస్ టీమ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| బి. శివధర్ రెడ్డి – Andhra Waves

హైదరాబాద్‌లో అడ్వకేట్ దారుణ హత్య | రంగారెడ్డి జిల్లా| రాజేంద్ర నగర్| అత్తాపూర్ పోలీస్ స్టేషన్| ముహమ్మద్ ఖాదిర్| క్లూస్ టీమ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| బి. శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


రంగారెడ్డి ఏర్పాటు రాజేంద్ర నగర్‌లో ఉన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. సులేమాన్ నగర్ ప్రాంతంలో ప్రముఖ అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖదీర్ తన అక్కడక్కడా ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అడ్వకేట్ పై దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశారు.

ఖదీర్ కి తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగిన ఘటన స్థలంలోనే మృతి చెందింది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రక్తపు మచ్చలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా కుటుంబ విభేదాల కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా బావమరిది వైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు..ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే న్యాయవాది మహమ్మద్ ఖదీర్ మొదటి భార్యను విడిచిపెట్టి…రెండో పెళ్లి చేసుకున్నాడు. తన అక్క కుటుంబం నాశనం అయిందని బామ్మర్దులు పగ పెంచుకొని హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో బయటపడింది… పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird