వానాకాలం పంట’కు (2025-26 సీజన్) సంబంధించి తాము 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాలనీ కేంద్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కలిశారు. వానా కాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎంటీ) అనుమతించారి
2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2024-25 వానా పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం, రాష్ట్ర మంత్రి నిర్ణయించారు.
నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే భరించినని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నాడు సేకరణకు తాము రుణం తీసుకున్నామని.. దానికి వడ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజ’న కింద 2021, మే నుంచి 2022, మార్చి వర’కు సరఫరా చేసిన అదనపు బియ్యం, 202 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 రాష్ట్రానికి సీఎం మంత్రి వర్గ విడుదల చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్‌కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉంటుంది.
