సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్థానిక సీఐ దూషించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. ఈ సందర్భంగా అడ్డుకోవడంతో జగ్గారెడ్డి మరియు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి క్షణాల్లోనే ఉద్రిక్తంగా మారి తోపులాటకు దారి తీసింది.
ఘటన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటలపాటు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు వివరణ కోరినట్లు సమాచారం. సీఐ ప్రవర్తనపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్న మని పోలీసులు తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో, ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
