ఆర్భాటం లేదు, హడావుడి లేదు.. ఫుల్ పేజీ ప్రకటనలు లేవు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించబడ్డాయి. అది ప్రభుత్వ బాధ్యత, చేసి తీరాలి అన్నట్లుగా చాలా కామ్ గా జగన్ హయాం నుంచీ బకాయిపడిన మొత్తం రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం చెల్లించింది. విద్యాశాఖ మంత్రిగా ఈ ఘనత నిస్సందేహంగా నారా లోకేష్ ఖాతాలోనే పడుతుంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు 12వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందంటూ నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు.
గత జగన్ ప్రభుత్వ విద్యా దీవెన పథకంలో భాగంగా నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ నిధులను చాలా మంది ఇతర కుటుంబ అవసరాలకు వాడుకోవడంతో కాలేజీలకు ఫీజు చెల్లింపులు జరగలేదు. ఫలితంగా విద్యాసంస్థల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి, విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల బకాయిల పెట్టింది. జగన్ సర్కార్ తప్పుడు విధానాల వల్ల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలూ పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ సమస్యపైనే కూటమి దృష్టి సారించారు. విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ చేసేలా రూపొందించారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన 1,200 కోట్ల రూపాయలతో పాత బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్ అయ్యేలా చేశారు. ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమ వేదికగా గుర్తించడం నారా లోకేష్.. విద్య విషయంలో ఆందోళన లేదు.. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోండి, ప్రభుత్వం మీకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. రీయింబర్స్ మెంట్ పాత బకాయిలన్నీ తీర్చి, ఇక నుంచి సకాలంలో నిధులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
.webp)
