
తన కెరీర్‌లో ఎన్నో ఘన విజయాలను అందుకున్నాడు రవితేజ(రవి తేజ). ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి'(ఇరుముడి) సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. ‘ఇరుముడి’తో రవితేజ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే, రవితేజ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు కూడా ఓటీ షోలు, సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేష్, రానా, నాగ చైతన్య వంటి హీరోలు ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రవితేజ కూడా అదే బాటలో పయనించే అవకాశం వచ్చింది.
ఒక వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రవితేజను సంప్రదించిందట. రవితేజ కూడా సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: రికార్డు ఓటీటీ డీల్ తో సంచలనం సృష్టిస్తున్న డ్రాగన్!
