Home Latest News లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి.. ఇక వైవీ అరెస్టు తప్పదా? | తిరుమలలడ్డు ప్రసాదం కేసులో కల్తీ నెయ్యి| ttd| మాజీ| చైర్మన్| అంగీకరించు| అరెస్టు – Andhra Waves

లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి.. ఇక వైవీ అరెస్టు తప్పదా? | తిరుమలలడ్డు ప్రసాదం కేసులో కల్తీ నెయ్యి| ttd| మాజీ| చైర్మన్| అంగీకరించు| అరెస్టు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్‌నకు రంగం సిద్ధమౌతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆయనకు జైలు తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఔనన్న సమాధానమే వచ్చేటట్టున్నది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక మలుపు తిరిగింది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏపీ సీఎం చేసిన ఆరోపణలు అవాస్తవమని సిట్ తేల్చిందంటూ వైసీపీ నానా హడావుడి చేస్తుంటే.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం సిట్ నివేదికలో నెయ్యికల్తీ విషయం స్పష్టంగా ఉందని కుండబద్దలు కొట్టారు.

వైసీపీ వాదన శుద్ధ తప్పనీ, దుష్ప్రచారం మాత్రమేననీ తేల్చేస్తూ జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. దీంతో తప్పు ఒప్పుకున్న వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. కాకుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ నిజమేనని చెప్పడం ద్వారా వైసీపీ నేతల నోళ్లు మూయించేశారు. వైవీ అంత స్పష్టంగా కల్తీ వాస్తవమేనని చెప్పడంతో నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇక అధికారాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది.

అదాలా ఉంచితే.. వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో, తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం తనకు కూడా తెలుసునని అంగీకరించారు. అంటే తెలిసి తెలిసి కల్తీని ప్రోత్సహించానని ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఆ కల్తీలో జంతువుల కొవ్వు లేదని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. అన్ని మించి వైవీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన తన లెటర్ హెడ్ పై ఇచ్చిన ఫోన్ నంబర్, చిన్నప్పన్న నంబర్ ఒక్కటేనని తేలడంతో నెయ్యి కల్తీ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డికి ప్రమేయం ఉందన్న అనుమానాలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు అనివార్యం అన్న పరిశీలకుల్లో కూడా వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird