బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజిలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని బెట్టు చేసిన పాక్ చివరికి మెట్టు దిగొచ్చింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో.. పాక్ మ్యాచ్ ఆడకపోతే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు.. పీసీబీని అభ్యర్థించింది. తమ అభ్యర్థనతో పాక్ నిర్ణయం మార్చుకున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి ఇచ్చిన థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ అని దిసనాయకే తన పోస్టులో పేర్కొన్నాడు, టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం కొలంబోలో జరగనున్న-పాక్ మ్యాచ్ కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌కు సహ అతిథ్య దేశమైన శ్రీలంక.. ఐసీసీ ప్రయత్నాలకు కూడా ధన్యవాదాలు తెలిపింది. 1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాల వల్ల ఇతర దేశాలు తమ దేశంలో ఆడటానికి దూరంగా ఉన్నప్పుడు భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలో ఆడటం ద్వారా చూపిన సంఘీభావాన్ని శ్రీలంక ఎప్పటికీ మర్చిపోలేని శ్రీలంక అధ్యక్షుడు చెప్పారు.
.webp)