ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు నిచ్చింది. ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో తీవ్రంగా ఉన్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక, అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌లతో ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించింది.
గత జులైలో జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాతిక కోట్ల మంది ప్రజలు, ఈ సారి ఫిబ్రవరి 12 (గురువారం) జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో అంతకంటే ఎక్కువగా దాదాపు 30 కోట్ల మంది పాల్గొననున్నారనీ కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
.webp)