వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేసింది, ..లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమోననే అనుమానం. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేసినట్లు ధ్వజమెత్తారు. ఇంతవరకు ఎప్పుడూ లడ్డూ వివాదం లేదని, జగన్ హయాంలో తిరుపతి లడ్డూ లేదని.. ఇది అన్యమతస్తుల కుట్ర అని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూను హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్నారని…ఈ విషయంలో తాము చాలా బాధపడుతున్నామని చెప్పారు.
జగన్ పాలనలో తిరుపతి లడ్డూపై చర్చ జరిగింది. లడ్డూ కల్తీ కూటమి నాయకులు మాట్లాడినప్పుడు తాము పట్టించుకోలేదని, తిరుపతి లడ్డూ సీబీఐ రిపోర్ట్ ఇవ్వడంతో నివ్వెరపోయామన్నారు. సోమవారం (9-2-24) విశాఖపట్నంలో శ్రీనివాసానంద సరస్వతి హాజరై, పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. సిట్ రిపోర్టుతో తాము భయాందోళనకు గురవుతున్నామని, సిట్ నివేదికతో హిందువులు ఆందోళన చెందుతున్నారని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. రూ.20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని సీబీఐ తేల్చిందని చెప్పుకొచ్చారు.
పమిత్రమైన లడ్డూలో ఫుడ్ మాఫియా అందుబాటులో ఉంది. రసాయనాలు కలిసిన లడ్డూ తిని భక్తులు పాలయ్యే అవకాశం ఉందని, లడ్డూ కల్తీపై సీబీఐ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినవారు వేంకటేశ్వరస్వామి శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. రెండు కొండలు అన్న రాజశేఖర్ రెడ్డికి ఎంత శిక్ష పడిందో అందరూ చూశారని చెప్పారు. సిట్ రిపోర్ట్ ఆధారంగా తక్షణమే ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూ కల్తీపై అప్పటి పాలకవర్గం నైతిక బాధ్యత వహించాలని, హిందూ సమాజానికి వెంటనే జగన్ అండ్ కో క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ రిపోర్టుపై నమ్మకం లేదని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఎద్దేవా చేశారు.
