ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది. అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఎంత గొప్ప గిఫ్ట్ ఇస్తే తమ ప్రేమ అంత గొప్పది అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ డబ్బు కంటే, బహుమానం కంటే.. మనసులో ఉన్న ప్రేమ, భావం చాలా ముఖ్యమైనది. ప్రేమిస్తున్న వ్యక్తి తనకు ఎంత ప్రత్యేకం అనే విషయాలు తెలియజేయడానికి డబ్బు పెట్టి బహుమానాలు కొని ఇవ్వాల్సిన అవసరం లేదని, మనస్ఫూర్తిగా కొన్ని పనులు చేయడం ద్వారా ప్రేమిస్తున్న వారిని సంతోషపెట్టాలని అంటున్నారు. ఇంతకీ డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రపోజ్ చేయడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
చేతి లేఖ..
నేటి డిజిటల్ యుగంలో, చేతితో రాసిన లేఖ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. మనసులో ఉన్న స్పష్టమైన భావాలను కాగితంపై ఉంచినప్పుడు అది ఎదుటి వారి హృదయాన్ని నేరుగా చేరుతుంది. ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారో, మొదటిసారి కలిసినప్పుడు ఎలా అనిపిస్తోందో.. వారితో గడిపే క్షణాలు ఎంత విలువైనవో వారికి తెలిసేలా మనసును ఆకట్టుకునే రాయవచ్చు. భాష మీద పట్టు, మంచి అభిరుచి ఉన్నవారు అయితే చిన్న కవిత లేదా భావుకతతో కూడిన వాక్యాలను కలిపి రాయవచ్చు.
సర్ప్రైజ్..
సర్‌ప్రైజ్‌లు అంటే ఎప్పుడూ ఖరీదైన హోటళ్లు లేదా పెద్ద పార్టీలు అంటే అర్థం కాదు. లాంగ్ డ్రైవ్‌లను ఆస్వాదించే అభిరుచి ఉంటే వారిని సాయంత్రం బయటకు తీసుకెళ్ళడం, ఎక్కవ గందరగోళం లేని ప్రదేశంలో ప్లాన్ చేయడం మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదా టెర్రస్‌పై విందును చాలా బాగుంటాయి. ఎదుటి వారికి ప్రాధాన్యత ఇస్తే అదే వారికి గొప్ప బహుమానం.
స్వీట్ మెమోరీస్..
ఒక ఖాళీ జాడి లేదా పెట్టె తీసుకొని చిన్న కాగితాలు కూడా తీసుకోవాలి. ప్రతి కాగితంపై ఇద్దిరకి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం, ఒక ఫన్నీ క్షణం లేదా భాగస్వామిలో ఉండే మంచి అలవాటును రాయాలి. ఈ బహుమతి చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇది మనసును హత్తుకునేలా చేస్తుంది.
ఖరీదు..
బహుమతులు ఖరీదైనవి కానవసరం లేదు. ఫోటో ఫ్రేమ్, పేరుతో డిజైన్ చేయబడిన కాఫీ మ్యాగ్, కీచైన్ లేదా సంబంధానికి రిలేటెడ్ గా ఉంటే ఏదైనా చిన్న వస్తువు మరింత హార్ట్ టచింగ్ గా ఉంటాయి. మనసులో ఉన్న ఆలోచన, ఎదుటి వ్యక్తి మీద ప్రేమ మొదలైన బహుమతిలో ఎక్స్‌పెస్ చేయగలిగితే దాని విలువ ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది.
సమయం..
ప్రేమను వ్యక్తం చేయడమే కాదు.. ఎదుటి వ్యక్తి ప్రాధాన్యతను ప్రత్యేకంగా కేటాయించాల్సింది సమయం. కనీసం ఒక్కరోజైనా పూర్తి సమయం వారితో గడపడానికి ప్రయత్నించడం, సోషల్ మీడియా ఫోన్ డిస్టర్బ్ ఎక్కువ లేకుండా చూసుకోవడం అవసరం. ఒకరితో ఒకరు సమయం గడపడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, హాయిగా నవ్వడం.. ఇవన్నీ బంధానికి కొత్తదనాన్ని ఇస్తుంది.
ప్రశంస..
చాలామంది తాము ఇష్టపడిన వ్యక్తిలో ఏ చిన్న తప్పు కనిపించినా దాన్న ఎత్తి చూపుతూ ఉంటారు. వారిని నొప్పించేలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిలో ఉండే మంచి అలవాట్లు, వారిలో ఉన్న ప్రత్యేకత చూడగలిగి, వారిని మెచ్చుకుంటూ ఉంటే.. ఇద్దరి జీవితాలు బాగుంటాయి. ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది.
*రూపశ్రీ.
