తిరుపతి జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. భర్త శివశంకర్ నిరుద్యోగం, అప్పుల భారం కారణంగా కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండటమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం… పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ(28), తొరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో పరిచయమయ్యారు.
కుల భేదం, శివశంకర్ ఉద్యోగం లేకపోవడం వంటి కారణాలతో పద్మ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయినా 2019లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజ(6), లాస్య(5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం పుత్తూరులో నివసిస్తూ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు.భర్త కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడం వల్ల పద్మపై ఆర్థిక భారమంతా పడింది. స్వయం సహాయక సంఘం ద్వారా రుణం తీసుకుని పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. శివశంకర్ లేకుండా తిరుగుతూ ఇంటికి డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగం పద్మ తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ శనివారం భర్త బయటకు వెళ్లిన సమయంలో డ్వాక్రా అప్పు చెల్లించావా అని పద్మ ఫోన్‌లో అడగగా, చెల్లించలేదని చెప్పడంతో ఆమె మరింత కుంగిపోయింది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో…“తల్లిదండ్రులను ఎదిరించి చేసుకున్నా ఇది నా జీవిత గుణపాఠం. లవ్ మ్యారేజ్ చేశానని ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పులు తీర్చలేకపోతే నేను ఇంకేం చేయాలి?
ఆపై బెడ్‌రూమ్‌లో తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను హాల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపులు తీయ మామ కన్నెప్పరెడ్డికి సమాచారం ఇచ్చాడు. ఆయన వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
