ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో సాగుతున్న భారీ అక్రమ వ్యాపారానికి హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం చెక్ పెట్టింది. విస్తరించిన నెట్‌వర్క్‌తో కార్యకలాపాలు సాగిస్తున్న సుమారు రూ.5,000 కోట్ల విలువైన ఆన్‌లైన్ గేమింగ్ సిండికెట్‌ను అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జీఎస్టీ ఎగవేతతో పాటు అక్రమ ఆర్థిక లావాదేవీలకు ఈ ముఠాపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఒకేసారి సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో కీలక పత్రాలు, డిజిటల్ డేటా, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ భారీ అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారంలో ముంబైకి చెందిన వై.ఎస్. ప్రభు కుమార్, హైదరాబా ద్కు చెందిన రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులుగా జీటీ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి మొత్తం ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యాపారం సాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గత సంవత్సరాలుగా ఈ సిండికేట్ ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గేమింగ్ ఆదాయాన్ని సరైన విధంగా ప్రభుత్వానికి తెలియజేయకుండా, జీఎస్టీ చెల్లింపులు తప్పించుకోవడానికి అక్రమంగా డబ్బును ఇతర మార్గాల్లో మళ్లించినట్లు సమాచారం.షెల్ కంపెనీలు, నకిలీ ఖాతాలు, డిజిటల్ వాలెట్ల ద్వారా డబ్బు తరలింపు జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.
విదేశీ సర్వర్లు, అనుమానాస్పద లావాదేవీల కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తులు, సంస్థల ప్రమేయం ఉండే అవకాశం ఉందని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల నిర్వహణ, డేటా నిల్వ, లావాదేవీల వివరాల సాంకేతిక నిపుణుల సహకారంతో లోతైన విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న ఆధారాలు కేవలం ప్రారంభ దశ మాత్రమేనని, దర్యాప్తు పూర్తయ్యేలోపు మరిన్ని కీలక విషయాలు, పెద్ద పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని జీఎస్టీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ కేసు ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో జరుగుతున్న అక్రమాలపై చర్చకు దారి తీస్తోంది.
.webp)