
-వికారాబాద్ లో జోరుగా సాగుతున్న ప్రచారం
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవాసం చేస్తోందని మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాములు పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని 26వ వార్డులో ఇంటింటి ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతోనే పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారథ్యంలో అధిక నిధులు తీసుకొస్తారని వికారాబాద్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. 34 కౌన్సిలర్ స్థానాలకు గాను 25 స్థానాలను అవలీలగా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి టీ మల్లేశంకు మద్దతుగా కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంపల్లి సర్పంచ్ అనంతయ్య, ధర్మపుర్ సర్పంచ్ అనిల్ కుమార్, కొండయ్య గంగులు కురుమ నిర్వహించారు.
