Home Latest News టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా శుభారంభం | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అమెరికాపై విజయం సాధించింది మొదటి| మ్యాచ్| మంచి – Andhra Waves

టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా శుభారంభం | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అమెరికాపై విజయం సాధించింది మొదటి| మ్యాచ్| మంచి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


టి20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. శనివారం అమెరికా జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి టి20 వరల్డ్ కప్‌లో విజయాల బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాను అమెరికా బౌలర్లు బెంబేలెత్తించారు. అభిషేక్ వర్మ, ఇషాంత్ కిషన్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. 13 ఓవర్లకు టీమ్ ఇండియా కేవలం 77 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే స్కిప్పర్ సూర్య ఒక ఎండ్ లో పాతుకు పోయి టీమ్ ఇండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి పరాజయం. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టి రాణించారు.

ఈ గెలుపుతో సరిగ్గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే మొత్తం వరల్డ్ కప్‌లో అంటే టి20, వన్డేలు కలిపి జట్టు విజయాల సంఖ్య 100కు చేరింది. ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా టీమ్ ఇండియా. 108 విజయాలతో ఆస్ట్రేలియా జట్టు తొలి స్థానంలో ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird