
-ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పనే
-ఎందుకు అలా చేసారు
-నెక్స్ట్ ఏం చేయబోతున్నారు
నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే కథ నేనే.. ఈ హర్రర్ సాంగ్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్, ప్రముఖ ఓటిటి దిగ్గజం జియో హాట్ స్టార్(Jio Hotstar) మధ్య చక్కర్లు కొడుతుంది. దీనికి ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచాడు ది రాజాసాబ్(ది రాజా సాబ్)మూవీ. అదేంటని అనుకుంటున్నారా! డీటెయిల్స్ చూసిన మీరు పూర్తి చేసిన సాంగ్ ని హమ్ చేస్తు ప్రభాస్ ఫ్యాన్స్ జియో హాట్ స్టార్ ని వీడేలా లేరని అంటారు. మరి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
రాజాసాబ్ నిన్న ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.దీంతో కొంతమంది అభిమానులు జియో హాట్‌స్టార్ ఆఫీస్‌కి పెద్ద ఎత్తున బిర్యానీ పార్సెల్ ఆర్డర్ చేసారు. వారి ఫుడ్ ఆర్డర్‌లకి సంబంధించిన జి హాట్‌స్టార్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో పాటు “లవ్వే… లవ్వే… అంతా లవ్వే. థాంక్యూ డార్లింగ్. అందరూ కొట్టి చంపేస్తారు… మీరు పెట్టి చంపేస్తున్నారు” అంటూ సరదా క్యాప్షన్ ఇవ్వడం నెటిజన్లని ఆకట్టుకుంది. దీనితో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
aఇంకా చదవండి: నువ్వు మాత్రం అలాగే ఉండు దొర.. మనసు మార్చుకోకు
థియేటర్లలో రాజాసాబ్ డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ బిర్యానీ పంపించడం ఆసక్తిగా మారడంతో పాటు ముందు మరిన్ని కానుకలు ఇస్తారేమో అనే చర్చ కూడా జరుగుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

