Home Latest News ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి..50 మందికి పైగా మృతి | ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి| 25| చనిపోయిన| 80 – Andhra Waves

ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి..50 మందికి పైగా మృతి | ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి| 25| చనిపోయిన| 80 – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం (ఫిబ్రవరి 6) జుమ్మా ప్రార్థనల సమయంలో ఓ షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఈ బాంబు దాడిలో 50 మందికి పైగా మరణించారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

తర్లాయ్ కలాన్‌లోని ఖదీజతుల్ కుబ్రా మసీదు లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో జరిగిన ఈ బాంబు దాడి ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని పోలీసులు గుర్తించారు. మసీదు ప్రధాన ద్వారం ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని ఉండొచ్చంటున్నారు. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird