గత రెండు రోజులుగా కొనసాగుతున్న కాల్పుల్లో మొత్తం 7 మంది మావోయిస్టులు హతమయ్యారని గడ్చిరోలి జిల్లా పోలీసులు అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ కీలక మావోయిస్టు నేత కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇన్చార్జ్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఇన్చార్జ్, CPI (మావోయిస్టు) 10వ నంబర్ కంపెనీ ఇన్చార్జ్ ప్రభాకర్ ఉన్నారని. ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా నివాసిగా పోలీసులు గుర్తించారు.
ప్రభాకర్‌పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందని అధికారులు తెలిపారు. అతడితో పాటు ఆరు మంది హార్డ్‌కోర్ మావోయిస్టులు కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా, గడ్చిరోలి స్థానిక భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు కార్యకలాపాలపై ఈ ఎన్కౌంటర్ దెబ్బగా ఉన్నట్లు అధికారులు తెలిపారు
