Home Latest News అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశి విధ్వంసం | అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సూర్యవంశీ రికార్డ్ బద్దలు కొట్టిన ఇన్నింగ్స్| 175 పరుగులు| 15ఫోర్స్ – Andhra Waves

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశి విధ్వంసం | అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సూర్యవంశీ రికార్డ్ బద్దలు కొట్టిన ఇన్నింగ్స్| 175 పరుగులు| 15ఫోర్స్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


14 ఏళ్ల కుర్రాడు అండర్ 19 వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగించాడు. టీమ్ ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ అనేక రికార్డులు బద్దలు కొట్టేశాడు. హరారే వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా అండర్ 19 జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

ఈ భారత్ సంస్థ అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవంగా నిలిచింది. 2022లో రాజ్ అంగద్ బావ 69 బంతుల్లో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 14 ఏళ్ల వైభవ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. ఇక, త’న తుపాను ఇన్సింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదిన వైభవ్.. మొత్తం 80 బంతుల్లో 175 పరుగులతో ఇంగ్లండ్ బౌలర్ల’ను ఊచకోత కోశాడు.

ఈ భారీ ఇన్నింగ్స్‌లో కలిసి కెప్టెన్ ఆయుష్ మాత్రే (53)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగులు, ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అండర్ 19 టోర్నీలో ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా సూర్యవంశి రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సూర్యవంశీ మెరుపు మ్యాచ్ ఫలితంగా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యవంశి 175 పరుగులలో 15 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. అండర్ 19 వన్డే టోర్నీలో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాటర్ గా కూడా సూర్యవంశీ రికార్డు సాధించాడు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird