
-సినిమా పేరు: శ్రీ చిదంబరం గారు
-న’టీన’టులు: వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, తులసి, కల్పలత, గోపి, శివకుమార్, అరుణ్ తదిత’రులు
-సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్
-ఎడిటర్: అన్వర్ అలీ
-సంగీతం:రవి. సి
-నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి, చింతా వినీక్ష రెడ్డి,
-బ్యానర్: శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్
-రచన, దర్శక’త్వం: వినయ్ రత్నం
-రిలీజ్ తేదీ : ఫిబ్రవరి 6 ,2026
‘క’ వంటి విభిన్నంగా నిర్మించిన శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ మరోసారి ‘శ్రీ చిదంబరం గారు’ అనే మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న చిదంబరంగారు మెప్పించారో లేదో చూద్దాం.
కథ
చిదంబరం( వంశీ తుమ్మల) అట్టడుగు వర్గానికి చెందిన నిరుపేద యువకుడితో పాటు ఎలాంటి కల్మషం లేని మంచి వ్యక్తి. తన చిన్న వయసులోనే అప్పులని తీర్చే దారి లేక తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో స్కూల్ మాసేసి తండ్రి అప్పులని తన భుజాన వేసుకుంటాడు. తాపీ పని చేస్తూ యేసుప్రభు ని తన దైవంగా కొలుచుకునే చిదంబరం ట్వంటీ ఫోర్ అవర్స్ కళ్ళకి కళ్ళజోడు ధరించి ఉంటాడు. కళ్ళజోడు తీస్తే తనలో ఉన్న లోపాన్ని చూసి చుట్టూ ఉన్న చిదంబరాన్ని మనుషులు అవహేళన చేస్తారు. దీనితో తనలో ఆత్మనూన్యత దెబ్బతిని డిప్రెషన్ లోకి వెళ్తాడు. లీల( సంధ్య) జాలి,దయ, కరుణ కలిగిన అందమైన యువతి. పొట్టకూటి కోసం కూలి పని చేసుకుంటూ తన ఇంట్లో వాళ్ళకి అండగా ఉంటుంది. చిదంబరం అంటే లీల కి ప్రేమ. ఎంతలా అంటే చిదంబరం డల్ గా ఉన్నా తను తట్టుకోలేదు. చిదంబరాన్ని ఎవరైనా చిదంబరం అని పిలిస్తే కోపం తో ఊగిపోయి తన పేరు చిదంబరం కాదు సాల్మన్ అని చెప్తుంది. చిదంబరం కి కూడా లీల అంటే చాలా ప్రేమ. పెళ్లి చేసుకుంటానని లీలతో చెప్తాడు. కానీ లీల ఒప్పుకోదు. దీనితో చిదంబరం ఒక నిర్ణయం తీసుకుంటాడు. చిదంబరం తీసుకున్న నిర్ణయం ఏంటి? చిదంబరాన్ని ప్రాణంగా ప్రేమించిన లీల ఎందుకు పెళ్లికి ఒప్పుకోలేదు? పెళ్లి చేసుకోనని లీల చెప్పింది నిజమేనా లేక అబద్దమా! అబద్దం అయితే అసలు నిజం ఏంటి ! లీల అలా చెప్పడం వల్ల చిదంబరం లైఫ్ లో ఏం జరిగింది? సాల్మన్ ని చిదంబరం అని ఎందుకు పిలుస్తున్నారు. చిదంబరం కి ఉన్న లోపం ఏంటి? ఎందుకు కళ్ళ జోడు ధరిస్తున్నాడు? ఆ లోపానికి లీల పెళ్ళికి ఉన్న సంబంధం ఏంటి? చివరకి శ్రీ చిదంబరం గారి టార్గెట్ ఏంటనేదే చిత్ర కథ
ఎనాలసిస్
రొటీన్ కి భిన్నమైన శ్రీ చిదంబరం లాంటి కథలు ఎక్కువగా తమిళ సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఆ చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల మనసు పొరల్లో ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాయి. అలాంటిది శ్రీ చిదంబరం గారు తెలుగులోనే డైరెక్ట్ గా రూపొందించడం శుభసూచికం. కానీ ఇలాంటి కధలకి బలమైన విలన్ క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి హడావిడి చెయ్యాలి. అదే విధంగా ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ ని కూడా ఒక రేంజ్ లో చెయ్యవచ్చు. కానీ మేకర్స్ ఆ కోణంలో ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండా సో గా వెళ్లారు. అలా అని సినిమా మెప్పించలేదని కాదు.
వాళ్ళు అనుకున్న పరిధి మేరకు మెప్పించారు. అసూయ, ఈర్ష్య, స్వార్ధం నిండిన నాలుకలు రక రకాలుగా మనుషులుగా మాట్లాడతాయి.అలాంటి వాళ్లని పట్టించుకుంటూ నీ జీవితాన్ని ఆపేస్తావా! నిన్ను నువ్వు ప్రేమించుకుంటు, నీకు జీవితాన్ని ఇచ్చిన, జీవితంలోకి రాబోయే వాళ్ళు నిన్ను ప్రేమిస్తే చాలదా అని చెప్పిన లైన్ అందర్నీ కట్టి పడేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే చిదంబరం తండ్రి సూసైడ్ చేసుకొని చనిపోయే సీన్ తో కథలోకి లీనమవుతాం. చిదంబరం చిన్నప్పటి సీన్స్ తో పాటు తల్లితో వచ్చిన సీన్స్ బాగానే ఉన్నాయి. చిదంబరం,లీల మధ్య వచ్చిన లవ్ సీన్స్ అయితే నాచురల్ గా ఉండటంతో పాటు నిజమైన ప్రేమని చూపించింది. ఈ ప్రేమ మధ్య బలమైన విలన్ ని ఇద్దరి ఆ విలన్ తాలూకు నేపధ్యాన్ని చెప్పాల్సింది. అలా కాకుండా ఒకే ప్లాట్ పై వెళ్లిపోయారు. చిదంబరం చేసే తాపీ వర్క్ కి అన్ని సీన్స్ అవసరం లేదు. దానికి బదులు చిదంబరాన్ని లీల నిజంగా ప్రేమించడం లేదని, జాలి చూపిస్తానని చీటింగ్ అయినా చేయాల్సింది.
చిదంబరం కూడా అదే విధంగా అనుకుని అతని పాయింట్ ఆఫ్‌లో ఎంటర్ టైన్ మెంట్ ని క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సూపర్ గా ఉండటంతో పాటు ప్రతి మనిషికి సంబంధించిన జీవిత సత్యాన్ని చెప్పింది. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే కొంచం స్లో గా సాగుతుందని చెప్పవచ్చు. లీల చెప్పిన పాయింట్ కి చిదంబరం కన్విన్స్ అయ్యి కళ్ళ జోడు తీసేసి తన మాస్ విశ్వరూపంతో తనని అవమానించిన వారు కుళ్ళు పడేలా తన మానరిజాన్ని చూపించాల్సింది. అందుకే బలమైన విలన్ ఉండాల్సిందని చెప్పేది.చిదంబరంలో ఆత్మ నూన్యత ని పోగొట్టోడానికే లీల ఆ విధంగా మాట్లాడిందని చెప్పి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది అలా కాకుండా ఫస్ట్ హాఫ్ లో లాగానే ప్లాట్ గా వెళ్లారు.
లీల ఇంటికి కిషోర్ పెళ్లి చూపులకి వచ్చిన సీన్ సూపర్. . చిదంబరం సూసైడ్ చేసుకొని చనిపోవాలని బాగోలేదు. లక్ష రూపాయిలు తీసుకొని పాస్టర్ మోసం చెయ్యడం సీన్ బాగా రావడంతో పాటు అలాంటి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. చిదంబరాన్ని వెతుక్కుంటూ లీల రాజమండ్రి వచ్చి వెతికే సీన్స్ బాగా ఉన్నాయి. చిదంబరం తన గురించి తను తెలుసుకునే సన్నివేశం సూపర్. ఎలాంటి కల్మషం, స్వార్ధం లేని యువతి యువకుల మధ్య పుట్టే స్వచ్ఛమైన ప్రేమ ముందు మనిషి రూపం, ఆర్థిక పరిస్థితులు చూపించవని చెప్పింది. క్లైమాక్స్ బాగుంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
చిదంబరం గా వంశీ తుమ్మల కథ పరిధి మేరకు అత్యద్భుతంగా చేసాడు. ముఖ్యంగా తన లోపాన్నిచూసి జనం ఎగతాళి ఒక గదిలో కూర్చొని ఏడ్చే సన్నివేశంలో సీనియర్ యాక్టర్ లా చాలా బాగా చేసాడు. కాకపోతే ఒకే తరహా బాడీ లాంగ్వేజ్ ప్రదిర్శించట్టుగా అనిపించింది. రాబోయే చిత్రాలలో అయినా ఈ విషయంలో జాగ్రత్త పడాలి. లీల గా చేసిన సంధ్య వశిష్ట తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. వంశీ కంటే ఎక్కువ వేరియేషన్స్ తన క్యారక్టర్ కి ఉన్నాయి. ఆ దిశగా మేకర్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చాలా క్యూట్ నెస్ యాక్టింగ్ ని ప్రదర్శించింది. తెలుగు సినిమాకి ఇంకో మంచి నటి దొరికిందని చెప్పవచ్చు.మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోకపోయినా వంశీ తల్లిగా చేసిన పుష్ప మదర్ కల్పలత, లీల తల్లిగా చేసిన సీనియర్ నటి తులసి, కిషోర్ గా చేసిన గోపి తమ క్యారెక్టర్స్ కి తగ పెర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. దర్శకుడు వినయ్ రత్నం(Vinay Rathnam)విషయానికి వస్తే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు కానీ రచయితగా కొంచం వెనకంజలో నిలిచాడని చెప్పవచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్నందున చిదంబరం కి ప్రాబ్లెమ్ చుట్టూ మరిన్ని బలమైన క్యారెక్టర్స్ ని కథలోకి ఎంటర్ చేసి హంగామా సృష్టించవచ్చు. కానీ ఆ దిశగా చేయలేదు. ఫొటోగ్రఫీ, సాంగ్స్ అయితే కథ కంటే మెజారిటీ మార్కులు పొందేలా కుదిరాయి. సాంగ్స్ లోని లిరిక్స్ కూడా ఎంతో అర్ధవంతంగా ఉండటంతో పాటు జీవిత సత్యాన్ని కూడా చెప్పాయి
నిర్మాణ విలువలు పర్లేదు.
ఫైనల్ గా చెప్పాలంటే మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడంతో పాటు జీవిత సత్యాన్ని చెప్పింది. కథనాల విషయంలో మరింత లోతుగా వెళ్లి ఉంటే శ్రీ చిదంబరం గారు తన రిజల్ట్ ని ఇంకా బెటర్ పొజిషన్ లో చూసుకునే వాడు.
రేటింగ్ 2.5/5 అరుణాచలం
