మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఫొదేవా ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ కగర్ లో భాగంగా జరుగుతున్న కూంబింగ్ లో మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (ఫిబ్రవరి 5) నుంచి సుదీర్ఘంగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
ఈ ఎన్ కౌంటర్ లో విధినిర్వహణలో ఉన్న ఒక కమెండో కూడా మరణించాడు. ఘటనాస్థలి నుంచి భద్రతా బలగాలు ఏకే 47, ఎస్ఎల్ఆర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోలు, భద్రతాబలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నాయి. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా శనివారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్ గఢ్ లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్ కౌంటర్ జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించేందుకు అమిత్ షా ఛత్తీస్ గఢ్ లో అందించనున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
